Akhil Lenin movie delay: సినిమా అనేది నటులను ప్రేక్షకులకు కనెక్ట్ చేసే ఒక ఎమోషన్…ముఖ్యంగా ప్రేక్షకుడు స్క్రీన్ మీద నటులను చూసే కోణం డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి హీరోలో తనను తాను చూసుకుంటాడు. అందుకే తన మనసుకు నచ్చిన హీరోకి అభిమాని గా మారిపోతాడు…ఇక ఈ క్రమంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు నాగార్జున… ఆయన క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సినిమాలను చేస్తున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన సినిమాలను చేయడంలో ఆయనకి ఒక డిఫరెంట్ శైలి ఉంది… అందుకే ఆయన ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తారు. ఇక అలాంటి నాగార్జున ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇక గత సంవత్సరం కూలీ, కుబేర లాంటి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ పోషించిన ఆయన ఇప్పుడు తన సినిమాలో హీరోగా నటిస్తూనే ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇక తన చిన్న కొడుకు అయిన అఖిల్ ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు పైనే అవుతుంది. అయినప్పటికి తనకి ఒక్క సక్సెస్ కూడా దక్కడం లేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో సక్సెస్ ని సాధించిన కూడా అది భారీ విజయంగా మాత్రం కన్వర్ట్ కాలేకపోయింది. దాంతో ఒక్క బిగ్గెస్ట్ సక్సెస్ కోసం అతను కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం లెనిన్ సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ అయితే తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో తనకు భారీ సక్సెస్ వస్తుందని పూర్తి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు.
నిజానికి అఖిల్ అన్ని విషయాల్లో చాలా బాగా కష్టపడతాడు. తనకు సక్సెస్ వచ్చేంతవరకు పట్టువదలని విక్రమార్కుడిగా ముందుకు సాగుతానని చెప్పాడు. అలాగే ఇప్పుడు లెనిన్ విషయంలో కూడా ఆయన అదే ఫాలో అవుతూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లెవెన్ సినిమా షూటింగ్ ఆగిపోయిందని కొద్ది రోజులపాటు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆ మూవీని స్టార్ట్ చేయలను చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకని ఈ సినిమా విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో ముందు శ్రీలీలా హీరోయిన్ గా నటించింది.
ఆమె కొద్ది రోజులు షూట్ చేసిన తర్వాత సినిమా నుంచి తప్పుకుంది. దాంతో ఆమె ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నారు… ఇక ఇప్పుడు చూస్తే ఆ సినిమాని కొద్దిరోజుల పాటు ఆపేసారంటూ వార్తలు వస్తున్నాయి. మరి అఖిల్ కి ఈ సినిమాతో అయిన సక్సెస్ దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…