Aamir Khan Latest News: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయానికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ నుంచి ఏ సినిమాలు వచ్చినా కూడా ఆ సినిమాలన్నీ సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలారు…ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలంటే ఈ ముగ్గురికే సాధ్యమయ్యేది. అలాంటి హీరోలు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఏ మాత్రం సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. ఇక అమీర్ ఖాన్ ఈ మధ్యకాలంలో సినిమాలను కూడా చేయడం లేదు. కారణం ఏంటి అంటే ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయా? లేదా అనే ఒక డైలామాలో తను పడిపోయాడు. తెలుగు సినిమా హీరోలందరు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే వాళ్లని బ్రేక్ చేయగలిగే సినిమా నేను చేస్తానా లేదా అనే భయంతోనే ఆయన సినిమాలు చేయడం లేదు. తన సినిమా ఫ్లాప్ అయిన లేదంటే తెలుగు హీరోల రికార్డు లను తన సినిమా బ్రేక్ చేయలేకపోయిన దానిని పెద్ద ఓటమిగా భావించే అవకాశాలైతే ఉన్నాయి.
అందుకోసమే అతను సినిమాలను చేయకుండా మంచి కథల కోసం వెతుకుతున్నాడు. దానికోసమే చాలా సంవత్సరాల పాటు ఎదురుచూస్తున్నాడు. ఇక తెలుగు సినిమా డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లితో తను సినిమా చేయబోతున్నాడు అంటు గతంలో వార్తలు వచ్చినప్పటికి అవి కార్యరూపం దాల్చలేదు.
ఆయన తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నాడా? లేదంటే కొత్త దర్శకులకు ఏదైనా అవకాశం ఇచ్చే ఛాన్సులు ఉన్నాయా? స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలనుకుంటున్నాడా మొత్తానికైతే తను ఏ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు.
మొత్తానికైతే అమీర్ ఖాన్ కి మనం చేసే సినిమాలు సక్సెస్ అవుతాయా? లేదా అనే ఒక భయమైతే పట్టుకుంది. మరి ఆ భయాన్ని పారద్రోలుతూ అతను గొప్ప సినిమా ఎప్పుడు చేయగలుగుతాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
