https://oktelugu.com/

Kovai Sarala: కోవై సరళ అందుకే పెళ్లి చేసుకోలేదా?

Kovai Sarala: తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటులకు కొరత లేదు. హాస్యం పండించే నటీమణులే అరుదుగా ఉంటారు. గతంలో మహిళా హాస్య నటిగా శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు దక్కింది. ఆమె దూరమయ్యాక తెలుగులో హాస్య నటీమణుల జాడ కరువైంది. ఈ నేపథ్యంలో నేనున్నానని ఓ నటి ముందుకొచ్చింది. తనదైన శైలిలో హాస్యం పండిస్తూ కమెడియన్లకు పోటీగా నిలిచింది. ఆమే కోవై సరళ. ఆమెది చెన్నై అయినా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు తిరుగులేని స్థానమే దక్కింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 19, 2022 / 09:07 PM IST
    Follow us on

    Kovai Sarala: తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటులకు కొరత లేదు. హాస్యం పండించే నటీమణులే అరుదుగా ఉంటారు. గతంలో మహిళా హాస్య నటిగా శ్రీలక్ష్మికి మంచి గుర్తింపు దక్కింది. ఆమె దూరమయ్యాక తెలుగులో హాస్య నటీమణుల జాడ కరువైంది. ఈ నేపథ్యంలో నేనున్నానని ఓ నటి ముందుకొచ్చింది. తనదైన శైలిలో హాస్యం పండిస్తూ కమెడియన్లకు పోటీగా నిలిచింది. ఆమే కోవై సరళ. ఆమెది చెన్నై అయినా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు తిరుగులేని స్థానమే దక్కింది. తెర మీద జీవితం కాకుండా తెర వెనుక జీవితాలు చూస్తే మనకు నిజంగానే బాధ కలుగుతుంది. 59 సంవత్సరాల సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. వైవాహిక జీవితానికి దూరమై కుటుంబాన్ని పోషించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.

    Kovai Sarala

    కాంచన సినిమాలో ఆమె చూపిన కామెడీని చూసి అందరు నవ్వుకున్నారు. తన డైలాగులతో అందరిని మెప్పించింది. నువ్వే కావాలి నుంచి నేటి వరకు దాదాపు 800 సినిమాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. బ్రహ్మానందం, కోవై సరళ జంట వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నవ్వులు పూయించింది. వారి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన కలెక్షన్లు సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోవై సరళ చూడటానికి చైనా మహిళగా అనిపిస్తుంది. ఆమె డైలాగ్ డెలివరీ మాత్రం ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తుంది. సినిమాల్లో సరళ పండించే హాస్యానికి ప్రత్యేకంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు.

    Also Read: Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులు ఈ రూట్లలో వెళ్లకండి

    ఇక వైవాహిక జీవితానికి వస్తే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన నలుగురు చెల్లెళ్ల కోసమే ఆమె వివాహం చేసుకోకుండా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కోవై సరళ అందరు హీరోలతో కూడా నటించి శభాష్ అనిపించుకుంది. వారి సినిమాల్లో హాస్యం పండిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. అప్పటి హాస్య నటి శ్రీలక్ష్మి సినిమాలకు దూరమయ్యాక సరళ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తోంది. సినిమాల్లో హాస్యం పండించడంలో ఆమెకు ఆమే సాటి. ఆమెకు ఆమే పోటీ.

    Kovai Sarala

    నలుగురు చెల్లెళ్ల ఆలనాపాలన చూసుకునే సరికే ఆమె సమయం అయిపోయింది. దీంతో నటనకు కుటుంబానికే పరిమితం అయింది. చెల్లెళ్ల బాగోగుల కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. మలి జీవితంలో సైతం తన చెల్లెళ్లే సర్వస్వం అని వారి కోసం బతుకుతోంది. ఇలాంటి మంచి చెడ్డలు చూసే అక్క వారికి లభించడం నిజంగా వారి అదృష్టమే. తెర మీద కనిపించే జీవితాల్లో దుర్భర పరిస్థితులు ఉంటాయనేది సత్యమే. అది చాలా మంది జీవితాల్లో కూడా కనిపించింది. తెర మీద ఎంత నవ్వుకున్నా జీవితంలో మాత్రం బాధలే వారికి బంధువులు కావడం తెలిసిందే. అలా బతికిన వారిలో ఉదయ్ కిరణ్, సిల్క్ స్మిత, రంగనాథ్, శ్రీదేవి, అంజలి వంటి వారు కూడా ఉన్నారు. అందరు కుటుంబం కోసమే సర్వస్వం త్యాగం చేసినా చివరక వారికి మిగిలింది కన్నీరే కావడం తెలిసిందే. ముఖానికి రంగు వేసుకున్నంత మాత్రాన వారి జీవితం పూల పాన్పు కాదు ముళ్ల దారిలానే ఉంటుంది.

    ఏ భాషలో నటించినా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆమెకు అలవాటు. ఎవరి వాయిస్ ను అరువు తెచ్చుకోకుండా తనదైన సొంత గొంతుతోనే జిమ్మిక్కులు చేసి తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరుస్తోంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తన టాలెంట్ ను నిరూపించుకుంది. తన నటనతో అందరిని మెప్పించింది. రాబోయే రోజుల్లో కూడా ఆమె మరిన్ని చిత్రాల్లో నటించి మెప్పిస్తారని ఆశిద్దాం.

    Also Read:Hero Arjun Becomes Director: డైరెక్టర్ గా మారిన హీరో అర్జున్.. తొలి సినిమా ఎవరితోనో తెలుసా?

    Tags