PKSDT Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముద్ర ఖని దర్శకత్వం లో తమిళం సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితమే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ ఏడాది జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది.
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాని #PKSDT పేరుతో పిలుస్తున్నారు.అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని వచ్చే వారం ప్రకటించబోతున్నారట. ఇది వరకే మూడు టైటిల్స్ ని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట.’గోపాల కృష్ణుడు’,’దేవుడే దిగి వచ్చినా’ మరియు ‘నేనే కాలాన్ని’ అనే టైటిల్స్ లో ఎదో ఒకటి ఎంచుకుందామని అనుకున్నారట.కానీ పవన్ కళ్యాణ్ ఈ మూడు టైటిల్స్ కాకుండా మరో విభిన్నమైన టైటిల్ ని మేకర్స్ కి సూచించినట్టు తెలుస్తుంది.
ఆ టైటిల్ ‘పరదేశ ప్రయాణం’ అట. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో సినిమాకి ఈ టైటిల్ ఏమాత్రం సరిపోలేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ నిరాశని వ్యక్తం చేస్తున్నారు.టైటిల్ కి సగం నీరసం వచ్చేసిందని, ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే ఇది కేవలం పవన్ కళ్యాణ్ సూచన మాత్రమే అని, త్రివిక్రమ్ దృష్టిలో ఒక అద్భుతమైన టైటిల్ ఉందని టాక్ వినిపిస్తుంది.మరి ఏ టైటిల్ ఖారారు చేస్తారో చూడాలి, వచ్చే వారం లో టైటిల్ ని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పేరు ‘టైం’ , అలాగే సాయి ధరమ్ తేజ్ పేరు ‘మార్కండేయ’ అట.పవన్ కళ్యాణ్ ఇమేజి కి తగ్గట్టుగా కేవలం ఒరిజినల్ వెర్షన్ లోని ఆత్మని తీసుకొని మొత్తంగా ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారట.త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే.