Bangarraju Movie: కింగ్ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ చిత్రంలో వీరి సరసన రమ్య కృష్ణ, కృతి శెట్టి లు హీరోయిన్లుగా చేస్తుండగా… కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాని జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఇంత వరకు క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదల అని అంటున్నారు కానీ ప్రమోషన్స్‌లో వెనుకబడి ఉంది. దీంతో అసలు బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.. లేదా అనే క్లారిటీ లేక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫూజన్‌లో ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా సూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడికాయ కొట్టేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రేపు న్యూ ఇయర్ కానుకగా ఉదయం 11.22 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తామని ప్రకటించిన పలు సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.
Lets Brighten up the New Year✨with
సోగాళ్ళ హంగామా ⚡Unveiling #BangarrajuTeaser 💥on
1st Jan 2022 @ 11:22 AM 🔐#Bangarraju #PandugalantiCinema 😉@iamnagarjuna @chay_akkineni@kalyankrishna_k @iamkrithishetty@anuprubens @ZeeStudios_ pic.twitter.com/NZlsR3CUei— Annapurna Studios (@AnnapurnaStdios) December 31, 2021
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వాయిదా పడిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కానుండగా.. ప్రభాస్ రాధే శ్యామ్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం లో రావు రమేష్, బ్రహ్మాజీ వెన్నెల కిషోర్, ఘాన్సి, అనిత చౌదరీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.