Bollywood: బాలీవుడ్ లో స్టార్ నటీనటులతో పాటు తమ పిల్లలు కూడా నిత్యం వార్తల్లో నిలుస్తారు. వారు సినిమాలో నటిస్తున్నారా లేదా అనేది సంబంధం లేకుండా వారి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేల కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నవ్య నవేల సినిమాలకు దూరంగా బిజినెస్ రంగంలో బిజీగా ఉంటుంది. అయితే నవ్య బాలీవుడ్ నటుడు మీజాన్ జఫ్రీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనిపై మీజాన్ తండ్రి స్పందించి వారిద్దరూ మంచి స్నేహితులు అని క్లారిటీ ఇవ్వగా మీజాన్ కూడా ఓ ఇంటర్వ్యూలో నవ్య తనకు స్నేహితురాలు అని చెప్పారు.

అయితే తాజాగా నవ్య ప్రేమలో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది కూడా “గల్లీ బాయ్” సినిమాలో కీలక పాత్ర పోషించిన సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో ఉన్నారని టాక్. అయితే ఈ జంట సీక్రెట్ గా తమ ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రేమ వ్యవహారంపై ఇంత వరకు నవ్య కానీ సిద్ధాంత్ కానీ స్పందించలేదు. ప్రస్తుతం నవ్య నవేలీ తన ఫ్యామిలీ బిజినెస్ తో బిజీగా ఉన్నారు. సిద్ధాంత్ చతుర్వేది , కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్, కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “ఫోన్ భూత్ ” షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే ‘బంటీ అండ్ బబ్లీ 2’ సినిమాలో దీపిక, అనన్య పాండే, సిద్ధాంత్ నటించనున్నారు.