Sobhita Dhulipala: తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో వేదికగా డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. కేవలం 300 మంది అతిథుల మధ్య నిరాడంబరంగా నాగ చైతన్య-శోభితల వివాహం ముగిసింది. నాగ చైతన్య కోరిక మేరకే పెళ్లి సింపుల్ గా ప్లాన్ చేశామని నాగార్జున స్పష్టత ఇచ్చారు. అక్కినేని వారి కోడలిగా శోభిత నాగార్జున ఇంట్లో అడుగుపెట్టింది. శోభితను కోడలిగా నాగార్జున మనస్ఫూర్తిగా అంగీకరించారు.
కాగా నాగ చైతన్యతో రెండేళ్లకు పైగా శోభిత రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి. సమంతతో విడాకులైన కొన్నాళ్ల నుండి నాగ చైతన్య మీద రూమర్స్ మొదలయ్యాయి. శోభిత, నాగ చైతన్య జంటగా విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఎఫైర్ రూమర్స్ ని ఈ జంట ఖండించడం విశేషం. సడన్ గా ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు.
వీరి ప్రేమ ఎలా మొదలైందనే సందేహాలు ఉన్న నేపథ్యంలో శోభిత ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. నాగ చైతన్యతో పరిచయం, ప్రేమ , మొదటిసారి ఎక్కడ కలిశారో వెల్లడించింది. 2022 నుండి నేను నాగ చైతన్యను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను. మా ఇద్దరికీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం. నాగ చైతన్య నన్ను తెలుగులో మాట్లాడమని కోరేవాడు. నేను తెలుగులో మాట్లాడటం వలన మా బంధం మరింత బలపడిందని, శోభిత అన్నారు. ఇంస్టాగ్రామ్ లో తన గ్లామరస్ ఫోటోలపై కాకుండా స్ఫూర్తి దాయకమైన పోస్ట్స్ మీద నాగ చైతన్య స్పందించేవాడట.
అప్పుడు నాగ చైతన్య హైదరాబాద్ లో నేను ముంబైలో ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు నన్ను కలిసేందుకు నాగ చైతన్య ముంబై వచ్చేవాడు. ఫస్ట్ టైం ముంబైలో ఒక కేఫ్ లో కలిశాము. అప్పుడు నాగ చైతన్య బ్లూ సూట్ వేసుకున్నాడు. నేను రెడ్ డ్రెస్ ధరించాను. అనంతరం కర్ణాటకలో ఒక పార్క్ లో కలిశాము. ఇద్దరం ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నాగార్జున కుటుంబం తనను ఆహ్వానించారట. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల సమయంలోనే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని, శోభిత ఓపెన్ అయ్యారు.