Shakeela: ‘డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్’ అని ఒక ఫేమస్ ఇంగ్లీష్ సామెత ఉంది. బుక్ విషయంలోనే కాదు మనిషి విషయంలో కూడా ఇదే కరెక్ట్. మనం చూసే మనిషి వేరు.. వారి మనసు వేరు కావచ్చు. ఇందుకు సరైన ఉదాహరణ ప్రముఖ నటి షకీలా జీవితం.
మనకు తెలిసిన షకీలా వేరు మనకు తెలియని షకీ అమ్మ వేరు. తెరపైన మనకు కనిపించిన ఆమె తీరు వేరు తెరవనక మనకు కనిపించని ఆమె వ్యక్తిత్వం వేరు. తనను తెరపైన మాత్రమే చూసిన వాళ్ళు షకీలా అంటే తన గురించి తెర వెనక తెలిసిన వారు మాత్రం తప్పకుండా షకీ అమ్మ అని అంటారు.
షకీలా అనే ఈ పేరు వింటేనే ఒకప్పుడు కుర్రకారు గుండెలు లయ తప్పేవి. ఆమె నటించిన చిత్రాలు విడుదల అవుతున్నాయి అంటే మలయాళ సూపర్‌స్టార్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అంతటి చరిత్ర ఉన్న శృంగార కథానాయకి షకీలా. ఆమె అందరికీ ఒక హాట్ బ్యూటీగా కనిపించేది.
కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఒకానొక టైంలో ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్‌కు చేరుకుంది. తను నమ్మిన పని ని తాను చేసుకుంటూ పోయింది. కానీ బయట మనుషులు అలా చూడలేదు. ఆమెను ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చారు. షకీలా ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్‌లో కూడా ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. తన సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేసి, ఆస్తిని మొత్తం తీసేసుకున్నారు.
ఆమె తెర పైన కనిపించినంత బోల్డ్ గా నిజ జీవితంలో ఉండలేకపోయింది. అందుకే చాలామంది ఆమెను మోసం చేసి పోయారు. తన తల్లికి మాయ మాటలు చెప్పి తన అక్కే మొత్తం డబ్బు తీసుకున్న షకీలా తన అక్కను ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారని.. తాను మాత్రం ఇలా అయిపోయినట్లు తనకు తానే బాధపడింది కానీ తిరిగి ఎలాగైనా ఆ డబ్బులు తెచ్చి చేసుకోవాలని అనుకోలేదు.
చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడింది ఈ నటి. సీన్ కోసం బట్టలు విప్పమని చెప్తున్నారని చెబితే.. నచ్చితే చెయ్ లేదంటే వదిలేయ్ అని చాలా ఈజీగా తన తండ్రి తనకు చెప్పేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది షకీలా.
అంతేకాదు తన గురించి తాను ఎప్పుడూ పెద్దగా ఆలోచించుకో లేదంట ఈ నటి. డబ్బులు సంపాదించింది కానీ అది తన దగ్గర పెట్టుకోలేకపోయింది. ఎన్నో సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ నటికి ఒక సొంత ఇల్లు కూడా లేదంటే.. ఆమె కోసం ఆమె ఎప్పుడు రూపాయి కూడా దాచుకోలేదు అనే విషయం అర్థమైపోతుంది. మరో విశేషమేమిటి అంటే సినిమాలు ఆపేశాక.. డబ్బు లేకుండా కష్టాలు పడుతున్న టైంలో కూడా ..ఇతరులకు సహాయం చేయాలని చూసింది ఈమె.
చాలా మంది ఆమె పేరు వినగానే ఛీ అనుకుంటారు. కానీ, నిజ జీవితంలో ఆమె ఎంతో మందికి అమ్మ అయ్యింది. తనని అందరూ ప్రేమగా షకీలా అమ్మ అని పిలుస్తారు. ఇల్లు, అమ్మ అనే పిలుపుకి దూరమైన ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్ కి షకీలా అమ్మగా మారింది. వాళ్లందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉంది. అంతేకాదు వారిని చూసి ఆమె ఎంతో ఆనంద ఆనందపడుతుంది.. తాను చనిపోతే తనకి ఎవరూ లేరనే బాధ లేదని ఎందుకంటే తనకంటూ ఎంతో మంది పిల్లలు ఉన్నారంటూ షకీలా పలుమార్లు చెబుతూ వచ్చింది. మొత్తానికి కొవ్వొత్తి కరుగుతూ కూడా వెలుగునిస్తుంది అనే సామెత ఇలాంటివారిని చూసే పుట్టిందేమో.
ఇక ఇలాంటి ఈ నిన్ననే బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి ఎంట్రీ వచ్చింది. తనపై ఉండే అభిప్రాయం, తన పేరును మార్చుకోవాలనే బిగ్ బాస్ కి వచ్చినట్లు ఈ సందర్భంగా షకీలా తెలియజేసింది. మొత్తానికి ఈ షో తో అందరికీ తాను షకీలా కాదని షకీ అమ్మ అని తెలియజేస్తుందని ఆశిద్దాం.