Pawan Kalyan OG: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో కథ ని ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ లను సాధిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో స్టార్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్… ఈయన చేసిన మొదటి సినిమా అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి మొన్న వచ్చిన బ్రో సినిమా దాకా అన్ని సినిమాల్లో తనదైన నటనతో మెప్పించాడు. అందువల్లే పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఎవ్వరికి లేనంత క్రేజ్ ఉందని చెప్పాలి.
ఇక ఆయన మెగాస్టార్ తమ్ముడిగా కెరియర్ కొనసాగించినప్పటికీ ఆయన సపరేట్ గా లైఫ్ ని లీడ్ చేస్తూ తన కెరియర్ లో ఎన్నో ఎదురెదుబ్బలు తిన్నాడు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడివలే సినిమాలను చేస్తూ సక్సెస్ లు సాధిస్తున్నాడు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు అని హీరోగా టాప్ లెవల్ కి వెళ్ళిపోయి అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్ లో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ ను ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఫినిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టుగా ప్రొడ్యూసర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు…ఇక ఇదిలా ఉంటే చాలా సినిమాల్లో హీరోలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా ఉండటం మనం తరచుగా చూస్తూ వస్తున్నాం. ఇక ఓజీ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒకరి ఫ్యాన్ గా కనిపించబోతున్నాడట. ఆయన ఎవరు అంటే ఒక్కప్పుడు క్యూబా దేశం లో విప్లవాన్ని సృష్టించిన చేగువేరా…
ఇక పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎప్పుడు చేగువేరా ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే ఈ సినిమాలో కూడా ఆయన్ని వాడుతూ పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్ గా కూడా కొన్ని సీన్లలల్లో కనిపించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సీన్లు సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయని కూడా చిత్ర యూనిట్ నుంచి సమాచారం అయితే అందుతుంది…