Chiranjeevi 157: మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే లైక్ చేయని వారు ఎవరు ఉంటారు. ప్రతి ఒక్కరు ఆయన సినిమా చూడాల్సిందే అంటారు. చిరు సైతం ఫ్యాన్స్ ను అలరించేందుకు వరుసబెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ వయసులో కూడా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘భోళా శంకర్’ యావరేజ్ టాక్ వచ్చినా.. నెక్ట్స్ మూవీ మాత్రం వేరే లెవల్లో ఉంటుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే బాస్ తరువాతి మూవీ పోస్టర్ #Mega157 పేరుతో రిలీజ్ అయింది. దీనిని చూస్తే చిరు పంచ భూతాలతో ఆడుకోనున్నారా? అనే చర్చ సాగుతోంది.
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘బింబిసార’ గురించి తెలిసే ఉంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. దీనిని వశిష్ట అనే డైరెక్టర్ తీశాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఆయన పనితనాన్ని మెచ్చుకున్న చిరంజీవి తనతో సినిమా చేసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఇంతకాలం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరంజీవి ఇప్పుడు నెక్ట్స్ మూవీ మాత్రం వశిష్టతో చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనతో చేసే మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా వివరాలు చెప్పకపోయినా పోస్టర్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఎందుకంటే ఓ ఈ పోస్టర్ లో పంచముఖ స్టార్ ఉండి పంచభూతాలను తెలిపే విధంగా సెట్ చేశారు. వీటిని బేస్ చేసుకొనే సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే మెగాస్టార్ త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకోవడంతో చిర రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు.
ఇక ‘బింబిసార’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ తో ఎటువంటి ప్లాన్ వేశారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పోస్టర్ లుక్ బాగుండడంతో సినిమాపై ఆంచనాలు పెంచేసుకుంటున్నారు. అయితే చిరు ఈ సినిమాతో సక్సెస్ కొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఆ సినిమా వివరాలు ఏంటో త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.