Homeఎంటర్టైన్మెంట్Devika Rani: సిల్వర్ స్క్రీన్ పై లాంగెస్ట్ లిప్ కిస్ సన్నివేశంలో నటించిన తెలుగు హీరోయిన్...

Devika Rani: సిల్వర్ స్క్రీన్ పై లాంగెస్ట్ లిప్ కిస్ సన్నివేశంలో నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

Devika Rani: ఎప్పటికి కూడా ముద్దు సీన్ అంటే ఇండియన్ ఆడియన్స్ కి ఒక సెన్సేషన్. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన హీరో, హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అదేదో తెగించిన విషయంగా అభివర్ణిస్తారు. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ లిప్ లాక్ సన్నివేశాన్ని బూతు కంటెంట్ గా అభివర్ణిస్తారు. ఇక తెలుగులో లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. కొందరు హీరోలు సైతం అందుకు అభ్యంతరం చెబుతారు. కానీ ఓ ఎనబై ఏళ్ల క్రితమే తెలుగు హీరోయిన్ సుదీర్ఘమైన లిప్ లాక్ సన్నివేశంలో నటించింది.

ఇండియాలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఫస్ట్ ఇండియన్ హీరోయిన్ గా పేరుగాంచిన దేవిక రాణి చౌదరి బోల్డ్ సన్నివేశంలో నటించి వార్తలకు ఎక్కింది. దేవిక రాణి సంపన్నమైన బెంగాలీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె 1908లో వైజాగ్ లో జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మధ్ నాథ్ చౌదరి. ఇండియాలోని ఫస్ట్ సర్జన్. వారిది జమిందారీ ఫ్యామిలీ. 9 ఏళ్ల వయసులో చదువుకోవడానికి దేవిక రాణి లండన్ వెళ్ళింది.

అక్కడే దర్శకుడు నటుడు హిమాన్షు రాయ్ తో పరిచయం ఏర్పడింది. 1929లో వారికి వివాహం జరిగింది. హిమాన్షు రాయ్ హీరోగా 1933లో కర్మ టైటిల్ తో బైలింగ్వల్ మూవీ తెరకెక్కించారు. ఆ చిత్రంలో హిమాన్షు రాయ్ కి జంటగా భార్య దేవిక రాణి నటించింది. ఆ చిత్రంలో సుదీర్ఘంగా నాలుగు నిమిషాల ముద్దు సన్నివేశం ఉంటుంది. హిమాన్ష్ రాయ్-దేవిక రాణి మమేకమై ఆ సన్నివేశంలో నటించారు.

అబ్బాయిని అమ్మాయి కన్నెత్తి చూడడమే తప్పుగా భావించే ఆ రోజుల్లో దేవిక రాణి ముద్దు సన్నివేశంలో నటించి వార్తలకు ఎక్కింది. దేవిక రాణి పదేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ దేవిక రాణి బంధువు అవుతారు. హిమాన్షు, దేవిక రాణి విదేశాల్లో సినిమా సాంకేతికత పై అధ్యయనం చేశారు. కర్మ మూవీ ఇంగ్లీష్ లో విజయం సాధించింది. హిందీలో మాత్రం ప్లాప్.ముంబైలో బాంబే టాకీస్ పేరుతో అత్యాధునిక స్టూడియో ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular