Bhanumathi: సింగర్ కమ్ హీరోయిన్ భానుమతి అంటే ఆ రోజుల్లో స్టార్ హీరోలు కూడా భయపడేవారు. ముక్కు సూటి తనం, మాట కరుకుతో ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా ఉండేవారు ఆమె. ఈ స్వభావం ఆమెకు రావలసినంత గుర్తింపు, అవకాశాలు రాకుండా చేసింది. అయినప్పటికీ భానుమతి రాజసంతో బ్రతికారు. కానీ ఆమె స్వభావాన్ని దగ్గరగా చూసినవారు మాత్రం చాలా మంచివారంటారు. సీనియర్ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ గారు ‘అంతస్తులు’ సినిమా షూటింగ్ లో జరిగిన అరుదైన సంఘటన ఓ సందర్భంలో తెలియజేశారు.

అంతస్తులు సినిమాకు భానుమతిని హీరోయిన్ గా అనుకున్నాం. నాగేశ్వరరావు గారు అప్పటికే మకాం హైదరాబాద్ కి మార్చేశారు. నాతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలు ఇక్కడికి వస్తేనే చేస్తానని కండీషన్ పెట్టారు. కావున భానుమతిగారిని హైదరాబాద్ పిలిపించాను. ఆమెకు హోటల్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఎందుకండీ హోటల్, సారథి స్టూడియోలో బస చేస్తా అన్నారు. రెండు షెడ్యూల్స్ బాగానే పూర్తి చేశాం. నెక్స్ట్ డే ‘దులపర బుల్లోడా’ సాంగ్ షూట్. పొద్దునే ఐదు గంటలకు ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి కొంప మునిగింది సార్… భానుమతిగారి ఏళ్ళు చుంచులు తినేశాయి అన్నాడు.
Also Read: Vikram Cobra First Review: విక్రమ్ ‘కోబ్రా’ మూవీ మొట్టమొదటి రివ్యూ ఎక్స్ క్లూసివ్ గా మీకోసం..

చుంచులు తినేయడం ఏంటని నేను కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్లేసరికి వేళ్లకు మందు రాసుకుంటున్నారు. సారి అండీ నేను హోటల్ లో ఉండమన్నాను మీరు ఇక్కడున్నారు. ఇప్పుడేమో చుంచులు కరిసేశాయి. డాక్టర్ ని పిలిపిస్తాను. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేయిస్తాను, అన్నాను. మీకేమైనా పిచ్చా ప్రసాద్ గారు. చుంచు కొరికిన దానికే నేను షూటింగ్ మానేస్తే నేను భానుమతి ఎలా అవుతాను, పదండి సెట్ కి వెళదాం అన్నారు. అలాంటి దృఢమైన వ్యక్తిత్వం కలిగినవారు భానుమతి అంటూ ఓ ఇంటర్వ్యూలో నిర్మాత రాజేంద్రప్రసాద్ గారు చెప్పుకొచ్చారు. అదే ఈ రోజుల్లో హీరోయిన్స్ అయితే పరిస్థితి వర్ణించడానికి కూడా కష్టం. నిర్మాత కష్టాలు చెప్పనలవి కావు.
[…] […]