Nikhil Karthikeya 2: చాలా మంది వితండం తెలివి అనుకుంటారు. విచ్చలవిడితనం స్వేచ్ఛలా, అరాచకం ధైర్యంలా చెలామణి అవుతుంది. దొంగ రాజు అవుతాడు. ఇదేదో మన కాంటెంపరరీ పొలిటికల్ కామెంట్ కాదు. కార్తికేయ2లో ఇంట్రో సీన్ ఇది. శ్రీకృష్ణుడు కలియుగానికి చెప్పిన భాష్యం. అచ్చం నడుస్తున్న చరిత్రలా అనిపించే వాస్తవం.
యుద్ధం చేయని వీరత్వం, తాత్వికతను బోధించిన చిలిపితనం, ధర్మాన్ని నడతలో చూపిన నాయకత్వం, స్నేహాన్ని నిర్వచించిన నిర్మలత్వం – శ్రీ కృష్ణుని గురించి ఇలా చెప్పాలంటే అలౌకిక అద్భుతాలు చాలానే ఉంటాయ్. గోపాలుడు కేవలం దేవుడు కాదు వైజ్ఞానిక దార్శనికుడు కూడా . ఇదే మాటకార్తికేయ2 లో నిఖిల్ అంటున్నాడు. క్రిష్ణావతారం చాలించే ముందు బొటనవేలు ఘట్టంతో మొదలు పెట్టి, కంకణం చుట్టూ తిరిగిన కథ కట్టి పడేస్తోంది. ద్వారక ఘట్టాలను డిపిక్ట్ చేసిన తీరు చూపు తిప్పుకోనివ్వదంటే చిన్న మాట. రెండున్నర గంటల సినిమాను ఇలా కదలకుండా కూర్చోబెట్టి, ఒక్క సెకను కూడా మెసలనివ్వకుండా చూపించడం అంటే మాటలు కాదు. అన్నిటికీ మించి మూడు వారాల్లో టాలీవుడ్ కి ఇది మూడో హిట్టు. సినిమా నిలవడమే గగనం అయిపోయిన సీజన్ లో టాలీవుడ్ డైరెక్టర్ల చతురత బహుశా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయం అయినా ఆశ్చర్యం లేదు.
Also Read: Rao Ramesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న రావు రమేష్.. కారణం అదే
కంటెంట్ విషయంలో పక్కా
నిఖిల్ స్టార్ డమ్ విషయంలో నడిమధ్యన ఉండే హీరో. కానీ కంటెంట్ విషయంలో పక్కాగా ఉండే కొద్ది మంది నటుల్లో ఒకడు. తన స్నేహితుడు చందు మొండేటి ముందు నుంచి వేసిన ముద్ర కూడా ఇలాంటిదే ! ఆఖరికి అదుపు తప్పిన అర్జున్ సురవరాన్ని కూడా ట్రాక్ మీదకి తెచ్చిన తీరు చూశాక చందు అంటే ఏంటో తెలిసింది చాలా మందికి ! ఇప్పుడు క్రిష్ణుడు కథను చెప్పిన తీరు చూశాక మరింత కనెక్ట్ కావడం ఖాయం. పూజిస్తాం కాబట్టి పనులు జరుగుతాయ్ అనుకోకూడదు. నమ్ముతాం కాబట్టి అవుతాయ్ … నమ్మకమే బలం, నమ్మకమే దేవుడు – లాంటి అర్థవంతమైన డైలాగులు ఓ డజనున్నర ఉండి ఉంటాయ్ ఈ సినిమాలో ! కొందరి నమ్మకం మరికొందరికి అమ్మకం అవుతున్న రోజుల్లో సున్నితమైన విషయాన్ని సెన్సిబుల్ గా చెప్పాడు కార్తికేయ2.
గట్స్ ఉండాలి
నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఇలాంటి కథలు ఎంచుకోవాలంటేనే రియల్లీ ఇట్ టేక్స్ సమ్ థింగ్ ! సినిమా మొదలైన కాసేపటికి పామును పట్టుకునే సన్నివేశంలో నిఖిల్ నటన చూసినప్పుడు గగుర్పాటు అంటారే, అది కల్గుతుంది. స్పార్క్ అంటే అదే కదా ! మరో మాట. ద్వారకలో క్రిష్ణుడి జీవిత ఘట్టాలను ఆవిష్కరిస్తూ, క్రిష్ణ తత్వాన్ని ఆధునిక జీవనానికి అన్వయిస్తూ సాగే కార్తికేయ బహుశా కొత్త తరాన్ని మన మైథాలజీకి మరింత దగ్గర చేస్తుంది. శని వారం రిలీజ్ చేయాలంటే దమ్ముండాలి. మరి రిలీజైన తొలి రోజే 25% రికవరీ అయ్యిందంటే కంటెంట్ కావాలి. ఆ రెండూ ఉన్న కార్తికేయ 2… కంగ్రాట్స్ !
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Interesting facts about hero nikhil and karthikeya 2 movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com