Hero Harish: సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. మొదట్లో ఎన్నో కష్టాలు పడినవారు.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకుంటే మరికొంత మంది కొన్ని సినిమాలు చేసి పాన్ ఇండియా లెవల్లో స్టార్ డం పొందినప్పటికీ కూడా సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో హరీష్ కూడా ఒకరు. హరీష్ కేవలం హీరో మాత్రమే కాదు అమ్మాయిల కలల రాకుమారుడు కూడా.. మహేష్ బాబు రేంజ్ లో అందంగా ఉండే ఈయన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తెలుగులోనే కాదు తమిళ్, హిందీ, మలయాళం అంటూ అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న హరీష్ ఒక్కసారిగా సినిమాలకు పూర్తిగా దూరం అవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంత అందం.. మంచి స్టార్ డం ఉన్న హరీష్ ఎందుకు సడన్ గా సినిమాలకు దూరం అయ్యాడు అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇకపోతే అందగాడు హరీష్ సినిమాలు థియేటర్లలో వస్తున్నాయంటే.. చూసిన ప్రేక్షకులు మళ్లీమళ్లీ థియేటర్లకు వెళ్లేవారు. అయితే ఆయనను చూడడానికి చాలా మంది థియేటర్లకు వెళ్తారు అనడంలో సందేహం లేదు. అందగాడిగా స్టార్ హీరోగా అనిపించుకున్న హరీష్ పుట్టి పెరిగిందంతా హైదరాబాదులోనే. 1979 లో ముద్దుల కొడుకు అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొండవీటి సింహం, సీతామహాలక్ష్మీ, శ్రీ మద్విరాట వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, నా దేశం, త్రిశూలం, ప్రేమాభిషేకం, ప్రేమ కానుక ఇలా ఎన్నో చిత్రాలలో నటించాడు.
ఇదే కాదు ఎనిమిదేళ్ల చిన్న ప్రాయంలోనే హిందీలో కూడా అడుగుపెట్టిన ఈయన అదే సమయంలో తమిళంలో కూడా స్టార్ హీరోల యంగ్ వర్షన్ పాత్రలో కనిపించి మెప్పించాడు. 13 ఏళ్లకే హీరోగా మారిపోయిన ఈయన మలయాళం లోను అలాగే తెలుగు, హిందీలో కూడా నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. మొత్తంగా 250 చిత్రాలలో నటించిన ఈయనను అందరూ హ్యాండ్సమ్ స్టార్ అని పిలుచుకునేవారు. అయితే కొత్త హీరోలు వచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో వెనుక అవకాశాలు తగ్గపోవడం అలాగే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ముంబైలోనే భార్య పిల్లలతో సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం అక్కడే వ్యాపారంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రేమ ఖైదీ సినిమాతో తెలుగు తెరపై సెన్సేషన్ క్రియేట్ చేశాడు హరీష్ కుమార్. ఆ తర్వాత ప్రేమ కానుకగా ప్రేమాభిషేకం వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. పెళ్లాం చెబితే వినాలి, రౌడీ ఇన్సెప్టెక్టర్, కాలేజీ బుల్లోడు, ప్రేమ విజేతా, ప్రాణదాత, మనవరాలి పెళ్లి, బంగారు కుటుంబం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆంధ్రకేసరి నటుడిగా అహ నా పెళ్ళంట సినిమాలకు నంది అవార్డులు అందుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి హిట్స్ కొట్టారు.
కానీ పాన్ ఇండియా స్టార్ డం ఉన్న హీరో ఇలా కనుమరుగు అవడంతో ఆయన అభిమానులు కలత చెందారు. ఎప్పటికి అయినా మళ్లీ సినిమాల్లోకి వస్తాడు అని ఎదురుచూశారు. కానీ ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం లేదు. ఇలా ఎంతో మంది ముందు స్టార్ పొజిషన్ లో ఉండి.. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో వారి పేరు కూడా వినిపడకుండా పోయింది.