Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: ఆ అవమానమే మెగాస్టార్ ని చేసింది... పద్మవిభూషణ్ చిరంజీవి సినిమా ప్రయాణం ఓ అద్భుతం!

Chiranjeevi: ఆ అవమానమే మెగాస్టార్ ని చేసింది… పద్మవిభూషణ్ చిరంజీవి సినిమా ప్రయాణం ఓ అద్భుతం!

Chiranjeevi: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు… అనేది నానుడి. చిరంజీవి జీవితం దీనికి పర్ఫెక్ట్ ఎక్సామ్ఫుల్. స్టార్ హీరోల సినిమాలు చూస్తూ, వారిలా తాను కూడా వెండితెర మీద వెలిగిపోవాలని చిరంజీవి కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా… టాలెంట్, పట్టుదల, క్రమశిక్షణతో టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. హీరో కావాలని చెన్నై వెళ్లిన చిరంజీవి నటనలో శిక్షణ తీసుకున్నారు. నటుడు సుధాకర్, హరి ప్రసాద్ లతో కలిసి ఒక చిన్న రూమ్ లో ఉండేవాడు.

హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదురు చూశారు. ఎందరో ఆత్మవిశ్వాసం దెబ్బతీసే ప్రయత్నం చేసినా… చలించకుండా అనుకున్నది సాధించాడు. ఒకరోజు థియేటర్లో జరిగిన అవమానం చిరంజీవిలో కసి పెంచింది. ఎలాగైనా స్టార్ హీరో కావాలనే పట్టుదలకు దారి తీసింది. నటుడిగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో చిరంజీవి, సుధాకర్, హరి ప్రసాద్… పూర్ణ పిక్చర్స్ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి… ఆ సంస్థ యజమానులకు రివ్యూలు చెప్పేవారట.

పూర్ణ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కొత్త సినిమా ప్రివ్యూ చూసేందుకు వెళ్లిన చిరంజీవి, సుధాకర్, హరి ప్రసాద్ ముందు వరుస కుర్చీలలో కూర్చున్నారట. తర్వాత ఆ మూవీ హీరో డ్రైవర్, మేకప్ మెన్స్ వచ్చి లేచి నిల్చోమన్నాడట. చేసేది లేక ఒక మూలాన నిల్చొని మూవీ చూశారట. అనంతరం పూర్ణ పిక్చర్స్ అధినేత భార్య సినిమా ఎలా ఉందని అడిగారట. జరిగిన సంఘటన చెప్పి… మీరు చూస్తూ ఉండండి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అవుతానని చిరంజీవి శబధం చేశాడట.

ఆ అవమానమే చిరంజీవిని తిరుగులేని స్టార్ గా ఎదిగేందుకు ఉసిగొల్పింది అంటారు. నటన, డాన్సులు, ఫైట్స్ లో తనదైన శైలి క్రియేట్ చేసుకున్న చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారు. పునాది రాళ్లు సినిమాలో చిరంజీవికి మొదటి అవకాశం వచ్చింది. ఈ శుభవార్త చెప్పేందుకు చిరంజీవి మొగల్తూరు వెళ్లారట. అమ్మ అంజనీ దేవికి చెప్పాడట. అప్పుడే స్క్రీన్ నేమ్ గా చిరంజీవి అని మార్చుకున్నాడట.

పునాది రాళ్లు షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రాణం ఖరీదు సినిమా ముందు విడుదలైంది. తర్వాత కే బాలచందర్ వంటి దిగ్గజ దర్శకులు చిరంజీవికి అవకాశాలు ఇచ్చారు. హీరోగా ఎదిగే రోజుల్లో ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేశాడు. ఎన్టీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రాల్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. 1983లో వచ్చిన ఖైదీతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న చిరంజీవి దశాబ్దాల పాటు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు.

సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హీరోగా చరిత్ర సృష్టించాడు. 45 ఏళ్ల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో చిరంజీవి అనేక అవార్డులు, రివార్డులు, గౌరవాలు అందుకున్నారు. తాజాగా భారత ప్రభుత్వం రెండవ అతిపెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది.

RELATED ARTICLES

Most Popular