Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu Rathika Rose: మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ప్రేమాయణం...

Bigg Boss 7 Telugu Rathika Rose: మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ప్రేమాయణం నడిపిన ప్రెసెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్…

Bigg Boss 7 Telugu Rathika Rose: బుల్లితెరపై స్పైసీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా లాంచ్ అవ్వడంతో ప్రస్తుతం బిగ్ బాస్ ఫాన్స్ ఫుల్ ఖుషి గా ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తున్నారు. ఈసారి హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ వచ్చి రాగానే ఎంతో కలుపుగోలుతనంగా ఒకరినొకరు విపరీతంగా పలకరించుకున్నారు కూడా. ఇక ఇప్పుడు కదా అసలు ఆట మొదలవుతుంది. ఈ కంటెస్టెంట్స్ లో ఏడు మంది మగవారు కాగా మిగిలిన ఏడు మంది మహిళా కంటెస్టెంట్స్ ఉన్నారు. అందరూ యమ యాక్టివ్గా వచ్చి రాగానే తమదైన శైలి ఆట మొదలు పెట్టేసారు.

అయితే చాలామంది దృష్టి అందరికంటే యాక్టివ్ గా ఉన్న కంటెస్టెంట్ రతికా పైన ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ లో హడావిడి చేయడమే కాదు…ఈ భామ ఇంతకుముందు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తో ప్రేమాయణం నడిపిందట. ఇప్పటికే సీక్రెట్ టాస్క్ లో భాగమైన రతిక…హౌస్ మేట్స్ మధ్య పుల్లలు పెట్టే పులిహోర కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య గొడవ పెట్టడానికి ఈ అమ్మడు ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తోంది.

ఇక ఈ అమ్మడు లవ్ ఎఫైర్ విషయానికి వస్తే.. అది ఒక సంపూర్ణ రామాయణం స్టోరీ అవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అసలు ఈ రతికా పేరు రతికా..కాదు ప్రియ. ఈటీవీలో ప్రసారమవుతున్న పటాస్ ప్రోగ్రాం తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత యూట్యూబర్ గా అవతారం ఎత్తింది. సడన్గా పేరు మార్పుకు కారణమైతే తెలియదు కానీ ..లవ్ బ్రేక్ విషయం మాత్రం బాగా తెలుసు. ఇంతకీ ఈమె లవ్ చేసిన ఆ సదరు వ్యక్తి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కావడమే ఇక్కడ విశేషం.

పీకల్లోతు ప్రేమలో మునిగిన కొద్ది రోజులకే బ్రేకప్ అవ్వడంతో ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్రంలో రతికా నటించిన పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. నేను స్టూడెంట్ సార్ మూవీలో చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి మాత్రం రతికా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన రతికా.. బిగ్ బాస్ ద్వారా తన క్రేజ్ పెంచుకోవడానికి పెద్ద తాపత్రయ పడుతోంది.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular