
India Today Conclave : Ramcharan comments on Salman Khan : #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత మూవీ టీం మొత్తం హైదరాబాద్ కి వచ్చేసింది.కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇంకా ఖాళీ అవ్వలేదు,తాను నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఇండియా టుడే ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్ఠటంకంగా భావించి నిర్వహించే కాంక్లేవ్ మీటింగ్ కి రామ్ చరణ్ ఒక గెస్ట్ గా విచ్చేశాడు.
ఇది తెలుగు వాడిగా రామ్ చరణ్ కి దక్కిన మరో అరుదైన గౌరవం గా చెప్పుకోవచ్చు.ఈ మీటింగ్ కి రామ్ చరణ్ తో పాటుగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి దిగ్గజాలు కూడా పాల్గొన్నారు.అయితే అందరి కంటే ముందు రామ్ చరణ్ తోనే ఈ ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ మన హీరో రాంచరణ్ ను స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు. కాసేపు #RRR మూవీ ముచ్చట్లు, అలాగే భవిష్యత్తు లో తాను చెయ్యబోయే సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.
ఇక బాలీవుడ్ హీరోలను మీ సౌత్ హీరోలు తొక్కేస్తున్నారంటూ రాజ్ దీప్ ఇంటర్వ్యూలో రాంచరణ్ ను ప్రశ్నించాడు. సల్మాన్ సాయంత్రం ఎవరినీ రానీయడు కదా మిమ్మల్నే రానిస్తాడని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలను చరణ్ కొట్టిపారేశాడు. మా తండ్రి చిరంజీవితో సల్మాన్ కు దగ్గరి స్నేహం ఉందని.. వారిద్దరూ క్లోజ్ అని.. అలా సల్మాన్ కు నాకు స్నేహం ఏర్పడిందని రాంచరణ్ తెలిపారు. ఎంత క్లోజ్ అంటే.. సాయంత్రం 5 తర్వాత ఎవరినీ రానీయని సల్మాన్ ఖాన్ తనను మాత్రం ఇంట్లోకి రానీస్తాడని చరణ్ తెలిపారు.
సాయంత్రం సల్మాన్ ఫుల్ జోష్ లో ఉంటాడని.. ఆయనతో కలిసి తాను ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు.