Actress Himaja : బుల్లితెర ప్రేక్షకులకు నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్స్ లో నటిగా తన కెరీర్ను ప్రారంభించిన హిమజ తన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత హిమాజ కు సినిమా అవకాశాలు రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్లో పలు సినిమాలలో నటించింది. చిత్రాలహరి, వినయ విధేయ రామ, జంబలకడిపంబ, ఉన్నది ఒక్కటే జిందగీ, వరుడు కావలెను, స్పైడర్ ఇలా పలు సినిమాలలో నటించి హిమజ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిమజకు బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం దక్కింది. బిగ్ బాస్ హౌస్ లో హిమజా తన డేరింగ్ అండ్ డాషింగ్ ఆటతీరుతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ కాకపోయినా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ తన బ్రేకప్, లవ్ స్టోరీ గురించి వాళ్ళు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో హిమజ ప్రేమ,పెళ్లి పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తను ప్రేమ, పెళ్లి గురించి పట్టించుకోవడం లేదని, తన దృష్టి మొత్తాన్ని ప్రస్తుతం తన కెరీర్ మీదనే పెట్టినట్టు తెలిపింది. ఇప్పటివరకు తన జీవితంలో పెద్దగా లవ్ లెటర్స్, ప్రపోజల్స్ రాలేదని కేవలం కాంప్లిమెంట్ గా మాత్రమే ఫ్లవర్స్ వచ్చాయని నటి హిమజ తెలిపింది. ఒక యాంకర్ మిమ్మల్ని ఎవరు లవ్ చేయరా ? అని అడిగితే… ఎందుకు చేయరు, నా లైఫ్ లో కూడా లవ్ స్టోరీ ఉన్నాయి అని హిమజ తెలిపింది. నన్ను చాలామంది లవ్ చేశారు. నేను కూడా వారిని లవ్ చేశాను. కానీ ప్రస్తుతం ఎవరి జీవితం వారికి ఉంది.
దాన్ని బ్రేకప్ అని చెప్పి లవ్ వాల్యూ తీయలేను అంటూ హిమజ చెప్పుకొచ్చింది. కానీ జీవితంలో ఒకసారి లవ్ చేస్తే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. అది సినిమాలలో నటించే క్యారెక్టర్ లాంటిది కాదు కదా.. అంటూ చెప్పుకొచ్చింది హిమజ. మరొక యాంకర్ మీ లైఫ్ లో.. మీ హార్ట్ లో ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.. నా హార్ట్ లో చాలామంది ఉన్నారు. కొంతమంది జీవితాంతం మనసులో అలాగే ఉండిపోతారు.
నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో ఒకరిని లవ్ చేశా, అతను నా మనసులో ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు అంటూ హిమజ ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలో హిమజ లవ్ స్టోరీ గురించి చెప్తూ ఒకరి గురించి చెప్తే వాళ్ల కాపురాలు కూలిపోతాయని టైటిల్ పెట్టి ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఆ టైటిల్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా తన స్నేహితురాలు అని, ఎక్కువగా వ్యూస్ కోసం అలా థంబ్ నెల్ పెట్టిందని హిమజ తెలిపారు.
నిజానికి ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే.. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని యాంకర్ నన్ను అడిగినప్పుడు.. వాళ్లు ఎక్కడో పెళ్లి చేసుకుని ఉంటారు. నేను వాళ్ల పేరు చెబితే.. వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కాపురాలు డిస్టర్బ్ చేయడం ఎందుకు మీనింగ్ లో మాట్లాడితే.. వాళ్లేమో నేను నోరు విప్పితే వాళ్ల కాపురాలు కూలిపోతాయి అంటూ టైటిల్ పెట్టి వ్యూస్ సంపాదించుకుంటున్నారు. ఎవరి స్వార్థం వాళ్ళది అంటూ నటి హిమజ కామెంట్స్ చేశారు.