Pawan Kalyan Help On Nithin: టాలీవుడ్ లో నితిన్, పవన్ కల్యాణ్ లకు మంచి స్నేహ బంధం ఉంది. నితిన్ అయితే ప్రతి సినిమాలో పవన్ పేరును ఎత్తకుండా ఉండలేరు. పైగా పవన్ కు తాను పెద్ద అభిమానిని అంటూ కూడా చెప్పుకుంటారు నితిన్. పవన్ ది ఏ సినిమా రిలీజ్ అయినా సరే.. థియేటర్‌కు వెళ్లి మరీ సినిమా చూసి తన ఫీలింగ్ ను పంచుకుంటారు హీరో నితిన్.

అయితే కెరీర్ తొలినాళ్లలో నితిన్‌కు పవన్ సాయం చేశాడంట. అది కూడా ఆర్థికపరంగా. నితిన్ తండ్రి మొదటి నుంచి టాలీవుడ్ లో పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నాడు. అప్పటికే మంచి సినిమాలు తీస్తూ ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ తేజతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ సారి తేజ ఒక పని విషయంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో నితిన్ హీరోగా పరిచయం కావాలని చూస్తున్నాడు.
Also Read: ప్రభాస్ ఒక్కఫైట్ కూడా లేకుండా చేసిన సినిమా ఇదే
ఇదే విషయాన్ని సుధాకర్ రెడ్డి డైరెక్టర్ తేజకు చెప్పారంట. నితిన్ అదృష్టమో ఏమో తెలియదు గానీ.. జయం మూవీ కోసం కొత్త యంగ్ హీరో కోసం తేజ వెతుకుతున్నాడంట. అదే సమయంలో నితిన్ గురించి సుధాకర్ చెప్పడంతో ఓ సారి ఆడిషన్స్‌కు రావాలని నితిన్‌కు సూచించాడంట తేజ. నితిన్ ఆడిషన్స్ లో బాగా చేయడంతో తేజ కూడా ఓకే అని చెప్పి జయం మూవీని మొదలు పెట్టారు.

అయితే మూవీ షూటింగ్ 60శాతం పూర్తయిన తర్వాత ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయంట. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే విధంగా ఆర్థిక సాయం అందించాడంట. ఇక 2002లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొదటి సినిమాతోనే నితిన్ రికార్డులు సృష్టించాడు. రూ.2కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.30 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. దీంతో హీరోగా నితిన్ పేరు మార్మోగిపోయింది. సినిమా పెద్ద హిట్ కావడంతో పవన్ ఇచ్చిన సాయాన్ని తిరిగి ఇచ్చేశారంట. కాగా పవన్ వల్లే తన మూవీ పూర్తియిందని, హీరోగా పేరు వచ్చిందనే కారణంగా.. అప్పటి నుంచే పవన్‌కు నితిన్ భక్తుడు అయిపోయాడు.
Also Read: బొమ్మరిల్లు మూవీని వదులుకున్న హీరో ఇతనే.. చేసుంటే పెద్ద స్టార్ అయ్యేవాడేమో..