https://oktelugu.com/

RRR: ‘ఆర్​ఆర్​ఆర్​’లో రాజమౌళి ఓల్డ్​ స్టైల్​తో కనిపించనున్నారా!

RRR: ప్రస్తుతం టాలీవుడ్​లో ఉన్న టాప్​ స్టార్​ దర్శకుల్లో ఒకరిగానే కాకుండా.. ఆల్​ ఇండియా లెవెల్​లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్​ ఎస్​ రాజమౌళి. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో భారతీయ సినిమా ఖ్యాతిని ఇంకో స్థాయిలో నిలబెట్టిన జక్కన రాజమౌళి. తాజాగా, ఈయన తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ తేజ్​, ఎన్టీఆర్​ హీరోలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోలు, గ్లింప్స్​ సినిమాపై ఓ రేంజ్​ హైప్​ క్రియేట్​ అవుతోంది.  అయితే, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 10:52 AM IST
    Follow us on

    RRR: ప్రస్తుతం టాలీవుడ్​లో ఉన్న టాప్​ స్టార్​ దర్శకుల్లో ఒకరిగానే కాకుండా.. ఆల్​ ఇండియా లెవెల్​లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎస్​ ఎస్​ రాజమౌళి. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో భారతీయ సినిమా ఖ్యాతిని ఇంకో స్థాయిలో నిలబెట్టిన జక్కన రాజమౌళి. తాజాగా, ఈయన తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ తేజ్​, ఎన్టీఆర్​ హీరోలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోలు, గ్లింప్స్​ సినిమాపై ఓ రేంజ్​ హైప్​ క్రియేట్​ అవుతోంది.  అయితే, ఒక దర్శకుడిగా ప్రేక్షకులు ఏం కోరుకుంటారో రాజమౌళికి బాగా తెలుసు. ఎమోషన్స్​, డాన్సులు, మ్యూజిక్​, ఫైట్స్​ ఇలా అన్ని కీలక అంశాలపై తనదైన ముద్రను రాజమౌళి సినిమాల్లో మనం చూశాం.

    కానీ, ఈగ, నుంచి బాహుబలి వరకు రాజమౌళి సినిమాల్లో డాన్స్​ను చాలా తక్కువగా చూస్తున్నాం. యమదొంగ, మగధీర సినిమాల్లో ఎన్టీఆర్, చరణ్ లతో చేయించిన సాంగ్స్ ట్రెండ్ సెట్టింగ్ డాన్స్ స్టెప్స్ ఇప్పటికీ వారి అభిమానులకు ఫేవరేట్​ స్టెప్పులుగా ఉన్నాయి. రవితేజ, ప్రభాస్ లతోనే అప్పట్లో సాలిడ్ సాంగ్స్ చేయించారు రాజమౌళి.

    కాగా, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆర్​ఆర్​ఆర్​ మూవీలో ఇద్దరు హీరోలతో కలిసి మాస్​ స్టెప్పులు వేయించేందుకు సిద్ధమయ్యారు రాజమౌళి. ఇందుకు సంబంధించిన పోస్టర్​ నెట్టింట వైరల్​గా మారింది. కాగా, ఇన్నేళ్ల తర్వాత తమ మార్క్​ను చూపిస్తూ..  సిల్వర్​ స్క్రీన్​పై ఇద్దరు మాస్​ హీరోలను ఒకే ఫ్రేమ్​లో తీసుకొస్తున్నారు జక్కన్న. నవంబరు 10న చెర్రి, తారక్​ కలిసి స్టప్పులేసిన సాంగ్​ వీడియో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళిని తన వింటేజ్​ స్టైల్​తో చూడబోతున్నామని చెప్పుకోవాల్సి వచ్చింది.