Love Mouli: ‘లవ్ మౌళి’ అనే విభిన్న తరహా చిత్రంలో నవదీప్ 2.0గా పరిచయం అవుతున్నాడు. కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లవ్ మౌళి’ మూవీ నుంచి నవదీప్‌కి జోడీగా నటిస్తున్న హీరోయిన్ ఫంకూరి అద్వాని ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

నైరా క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్‌రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. గోవింద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తానికి లవ్ మౌళి నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమా పై ఇంట్రెస్ట్ పెంచారు. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నవదీప్ లుక్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వెరైటీ గెటప్ లో తేనె తాగుతూ కనిపించి నవదీప్ షాక్ ఇచ్చాడు.
Also Read: అదరగొడుతున్న కళావతి.. 19 మిలియన్ వ్యూస్ !
మొత్తమ్మీద హీరో నవదీప్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ‘లవ్ మౌళి’ అనే విభిన్న తరహా చిత్రంలో నవదీప్ 2.0గా జడలు కట్టిన వేషంలో తేనె తాగుతూ నవదీప్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా హీరో నవదీప్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇప్పుడు కొత్త గెటప్ తో అండ్ సెటప్ తో సోషల్ మీడియాలో ప్రస్తుతం మళ్ళీ వైరల్ గా మారాడు. అన్నట్టు రెండు వారాల క్రితం పెళ్లి విషయంలో కూడా నవదీప్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: చైనాపై ఆధారపడకుండా భారత్ ఉండలేదా..?
[…] Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు డిజిటల్ వేదికపై ఉర్రూతలూగించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఓ హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ను రీమేక్ చేస్తోందట. అందులో తొలుత బాలీవుడ్ స్టార్‌ను తీసుకోవాలని భావించినప్పటికీ.. సౌత్ ఇండియా నుంచి అటెన్షన్ రాబట్టేందుకు రామ్ చరణ్‌ని ఎంపిక చేశారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. […]
[…] Director Maruthi: కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని రూమర్స్ వినిపించాయి. పైగా ఈ వార్తలపై డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. […]