AP High Court- Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో.. ప్రేక్షకులను ఎంతగానో ఇది ఎంటర్ టైన్ చేస్తున్నా కానీ.. సంప్రదాయవాదులకు మాత్రం ఇదో ‘బూతు షో’. సీపీఐ నారాయణ లాంటి వారికైతే ఇదో ‘బ్రోతల్ హౌస్’. ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఈ బిగ్ బాస్ షోను చూడకుండా ప్రేక్షకులు ఉండలేకపోతున్నారు. దాని రేటింగ్ కూడా తగ్గడం లేదు.

బిగ్ బాస్ షో అశ్లీలత ఎక్కువ అవుతోందని.. దీన్ని నిషేధించాలని అప్పట్లో ఏపీ హైకోర్టులో కొందరు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటీషన్ తరుఫున న్యాయవాది వాదించారు. ఈ సమయంలో అశ్లీలతపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 1970ల్లో సినిమాలు ఎలా ఉండేవో తెలుసు కదా? అటూ వ్యాఖ్యానించింది.
Also Read: Anupama Parameswaran: షాకింగ్ న్యూస్… సినిమాలకు గుడ్ బై చెప్పిన అనుపమ?
ఈ కేసుపై స్పందించడానికి సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోరారు. దీంతో విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేశారు.

బిగ్ బాస్ షోపై విమర్శలు రావడం ఇదేం కొత్తకాదని చెప్పాలి. గతం లోనూ ఈ షో పై చాలా విమర్శలొచ్చాయి. అయితే నెగెటివ్ కామెంట్స్ కూడా షోకి ప్లస్ అవుతాయంటూ తమపని తాము చేసుకుపోతున్నారు నిర్వహకులు.
Also Read: Hari Hara Veera Mallu: ‘బుక్ మై షో’ యాప్ లో సంచలన రికార్డు ని నెలకొల్పిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం
[…] […]