Illu Illalu Pillalu Prema removed: స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సీరియల్స్ లో ఒకటి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’. బుల్లితెర పై ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో హీరో గా నటించి , బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా , సీనియర్ హీరోయిన్ ఆమని ప్రభాకర్ కి సతీమణి గా నటిస్తోంది. ఈ సీరియల్ లో ప్రతీ క్యారెక్టర్ కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందులో రామరాజు పాత్రకు చిన్న కోడలు ‘ప్రేమ’ పాత్ర కూడా ఉంది. ఈ పాత్రని లావణ్య పోషించింది. అయితే ఈమె గత కొన్ని ఎపిసోడ్స్ నుండి కనిపించడం లేదు. ఆమె స్థానం లోకి మరొకరు వచ్చారు. లావణ్య కి ఏమైంది?, ఎందుకు ఆమెని ఈ సీరియల్ నుండి తప్పించారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.
అయితే ఈమె ఈ షో నుండి తప్పుకోవడానికి కారణం ప్రెగ్నన్సీ అని తెలుస్తుంది. రీసెంట్ గానే ఈమె ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఈమె చివరి ఎపిసోడ్ కి మూవీ టీం ప్రత్యేకంగా ఆమె చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మిమ్మల్ని ఇక బాగా మిస్ అవుతాము అంటూ ఆ వీడియో కింద అభిమానులు వందల సంఖ్యలో కామెంట్స్ చేయడం చూస్తుంటే ఈమెకు ఎంత క్రేజ్ ఉంది అనేది అర్థం అవుతోంది. రెండేళ్ల క్రితం ఈమె శశి హెగ్డే అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈయన కూడా సీరియల్ హేరియన్. ప్రతీ రోజు ఈటీవీ ఛానల్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే అందాల రాక్షసి సీరియల్ లో ఈయన హీరోగా నటిస్తున్నాడు. అదే విధంగా కన్నడ లో గతంలో ఈయన చాలా సీరియల్స్ లో హీరో గా నటించాడు. ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు కలిసి అప్లోడ్ చేసే ఫోటోలు , వీడియోలు చూసేందుకు చాలా క్యూట్ గా ఉంటాయి.
