
సినిమా ఇండస్ట్రీ చాలా క్రూరమైనది. ఈ మాట అనాలి అంటే.. ముఖ్యంగా హీరోయిన్ అన్నది అంటే.. ఆమె ఎంతగా నలిగిపోయి ఉండాలి. ఎంతమంది ఆమెను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉండాలి. పాపం ఒక్క మాటలోనే ఇలియానా సినిమా ఇండస్ట్రీలోని లొసుగులు గురించి క్లుప్తంగా తేల్చి పడేసింది. మొత్తానికి ఈ గోవా సుందరిలో ఉన్న బాధను తాజాగా చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చే విషయంలో సమానత్వం ఉండదని చెప్పుకొని కుమిలిపోయింది.
ఇక్కడ కేవలం పాపులారిటీనే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ గా చూస్తారు తప్ప, మనిషికి విలువ ఇవ్వరు అని, ఎప్పుడైతే ఆ మనిషి తన పాపులారిటీ కోల్పోతాడో ఇక అప్పటి నుండి ఆ వ్యక్తికి అవకాశాలు రావని ఇలియానా చెబుతూనే ఎమోషనల్ అయింది. తన విషయంలోనూ ఇదే జరిగిందంటూ మనసులోని బాధను బయట పెడుతూ ఎంతో నలిగిపోయింది ఇల్లీ బేబీ. ఏదో చిన్నాచితకా హీరోయిన్ ఇలాంటి కామెంట్స్ చేస్తే.. సీరియస్ గా తీసుకోకపోవచ్చు.
కానీ కామెంట్స్ చేసింది ఇలియానా. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మరియు హిందీ భాషల్లో కూడా దాదాపు అందరి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసి గ్లామరస్ ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లు తింది. మరెన్నో ఒడిదుడుకులు చూసింది. ఇలాంటి ఇలియానా ఇండస్ట్రీ గురించి ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది అంటే.. దానిలో కచ్చితంగా నిజం ఉంటుంది. అందుకే ఈ ముదురు భామ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఇలియానా కామెంట్స్ ను షేర్ చేస్తూ తెగ లైక్ చేస్తున్నారు.
మరి ఈ క్రూరమైన ఇండస్ట్రీ పరిస్థితులలో హీరోయిన్ గా నిలబడడం దాదాపు కష్టమని ఇలియానానే చెబుతుంటే.. ఇక చోటా హీరోయిన్స్ పరిస్థితి ఏమిటి ?, ఈ లెక్కన ఒక్కప్పటిలా ఇప్పటి హీరోయిన్లకి లాంగ్ కెరీర్ ఉండదు. ఇక ఇలియానా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫేర్ అండ్ లవ్లీ అనే సినిమాలో మంచి బోల్డ్ పాత్రలో నటిస్తుంది.