Hyper Aadi Remuneration: ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా నేడు ఇండస్ట్రీ కి ఎంతమంది స్టార్ కమెడియన్స్ వచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కొంతమంది అయితే ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో క్రేజీ సినిమాల్లో ఆఫర్స్ సాధించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందారు..వారిలో ఒకరే అనసూయ..పుష్ప 2 సినిమా సెన్సషనల్ హిట్ అయ్యి ఈమెకి తెచ్చిన పేరు ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..ఇక ఈ షో ద్వారానే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ ఇలా ఒక్కరా ఇద్దరా ప్రతి ఒక్కరు సంవత్సరానికి కోట్లు సంపాదించే రేంజ్ ఆర్టిస్ట్స్ గా ఎదిగారు..ఇక హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సినిమాల మీద పిచ్చి తో చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం ని కూడా వదిలేసి అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు..అలా అదిరే అభి టీం లో వేసే స్కిట్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించే ఛాన్స్ వచ్చింది..తనలో ఉన్న అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించి టీం లీడర్ గా ఎదిగి నేడు ఏ స్థానం లో ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read: Sreeleela: రాఘవేంద్రరావు రుణాన్ని తీర్చుకోలేదట.. కుర్ర భామ కొత్త కబుర్లు
నేడు ఈటీవీ లో ప్రసారం అయ్యే ప్రతి షో కి హైపర్ ఆది ఒక్క ఫేస్ గా మారిపోయాడు..ముఖ్యంగా జబర్దస్త్ షో కి..ఈ షో ని జనాలు ఇప్పటికి చూస్తూ ఉన్నది కేవలం హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ కోసమే..వీళ్లిద్దరు ఇప్పుడు షో మానేయడం తో TRP రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి..సుడిగాలి సుధీర్ మొత్తానికే ఈటీవీ ని వదిలేయగా..హైపర్ ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఢీ షోస్ లో కొనసాగుతున్నాడు..హైపర్ ఆడికి జబర్దస్త్ షో కి వచ్చే ముందు 20 లక్షల రూపాయిలు అప్పు ఉండేది..దీనితో పాటు ఆయనకీ ఉన్న 20 ఎకరాల పొలం ని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది..కానీ ఈ జబర్దస్త్ షో ద్వారా హైపర్ ఆది హైదరాబాద్ లోనే స్థిరాస్తులను సంపాదించుకోవడమే కాకుండా..పోగొట్టుకున్న ఆ 20 ఎకరాల పొలం ని కూడా తిరిగి సంపాదించుకున్నాడు..హైపర్ ఆది కి ఒక్కో ఎపిసోడ్ కి 5 నుండి 6 లక్షల రూపాయిలు ఇస్తారట..బుల్లితెర మీద హైయెస్ట్ పైడ్ ఆర్టిస్ట్స్ లో హైపర్ ఆది టాప్ 2 స్థానం లో ఉంటాడని తెలుస్తుంది.

Also Read: MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?