Malaika Arora: హీరోయిన్ మలైకా అరోరా సెక్సీ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తుంటుంది. మలైకా అరోరాకి బాలీవుడ్ లో, తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది. ఐతే, తనకున్న అందచందాలకు, తన శరీర సౌష్టవానికి ఇంకా ఎక్కువ గుర్తింపు రావాలి అని, కానీ తనకు రావాల్సిన స్థాయిలో అవకాశాలు రాలేదు అని మలైకా ఫీల్ అవుతుంది.

పైగా మలైకా అరోరా సినిమాల్లో అవకాశాలు అనే ఐటమ్ పై చాలా విషయాలే చెప్పుకొచ్చింది. ఆమె కోణంలో నుంచి చూస్తే.. ‘తనతో పోల్చుకుంటే.. కేవలం ఎర్రగా ఉండడం వల్లే బాలీవుడ్ లో పలువురు భామలకు ఎక్కువ ఛాన్సులు వచ్చాయట. కొందరి హీరోయిన్స్ లా మలైకా అరోరా పూర్తిగా తెల్లగా ఉండకపోవడం వల్లే ఆమెను పట్టించుకోలేదు అని, హీరోయిన్ గా క్రేజీ ఛాన్స్ లు ఇవ్వలేదని మలైకా అరోరా చెప్తోంది.

మలైకా అరోరా ఇంకా మాట్లాడుతూ.. “ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్ లో కలర్ వివక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. ‘నా కలర్ వల్లే నాకు ఛాన్సులు తగ్గాయి. ఇక్కడ ఫెయిర్ గా ఉంటేనే అందం అనుకునే వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. మెయిన్ గా హీరోయిన్ అంటే.. వాళ్ళ దృష్టిలో మెరిసిపోవాలి. కానీ మలైకా అయినా నేను అలా ఉండను కదా. అందుకే.. హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు నాకు రాలేదు.

Also Read: Rajamouli And Koratala As Producers: నిర్మాతలుగా రాజమౌళి, కొరటాల.. సినిమాలు అవే !
నా అనుభవంలో నాకు అర్ధం అయింది ఏమిటంటే.. బాలీవుడ్ లో టాలెంట్ కన్నా ఎర్రగా ఉండడం ముఖ్యం. దానివల్ల నాలాంటి నల్లగా ఉండే అమ్మాయిలకు సరైన ఆఫర్లు రావడం లేదు. ఈ పద్దతి మారాలి’ అంటూ మలైకా అరోరా తనదైన శైలిలో రెచ్చిపోయింది. అయినా ముదురు వయసులో హీరోయిన్ గా అవకాశాలు రాలేదు ఫీల్ అయితే ఉపయోగం ఏముంది ?

ప్రస్తుతం ‘మలైకా అరోరా’ వయసు 48 ఏళ్ళు. అయితే, ఈ వయసులోనూ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాల పేరుతో హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక చాలా కాలంగా అర్జున్ కపూర్ తో సహా జీవనం కూడా చేస్తోంది మలైకా. వీరి రొమాన్స్ కి అడ్డు అదుపు లేదు. అన్నట్టు వీళ్ళు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు అని తెలుస్తోంది.

Also Read: Star Hero Who Missed Vakeel Saab: వకీల్ సాబ్ ని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?
[…] […]