Anil Ravipudi comments on Rajinikanth: వరుసగా రెండు రీజనల్ ఇండస్ట్రీ హిట్స్ ని అందుకొని తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi), ఇప్పుడు మినీ రాజమౌళి రేంజ్ కి తన స్థాయిని పెంచుకున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ తో అనిల్ రావిపూడి ఇక ఏ సినిమా తీసినా గుడ్డిగా టిక్కెట్లు బుక్ చేసుకొని వెళ్లిపోవడమే అనే రేంజ్ లో ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. నేటి తరం స్టార్ హీరోలతో ఆయన చేతులు కలిపితే అద్భుతాలే జరుగుతాయి. చాలా మంది పవన్ కళ్యాణ్ తో ఆయన తదుపరి చిత్రం ఉంటుందని అంటున్నారు, ఇది జరిగితే బాక్స్ ఆఫీస్ విద్వంసం మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే అనిల్ రావిపూడి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రజినీకాంత్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ముందుగా యాంకర్ అనిల్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘చిరంజీవి గారికి 70 ఏళ్ళ వయస్సు వచ్చింది. ఆయన వయస్సుకి తగ్గ పాత్రలు చేయడం లేదు, ఇంకా హీరోయిజం పాత్రలే చేస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి, దీనికి మీ స్పందన ఏంటి?’ అని అడగ్గా, అనిల్ రావిపూడి అందుకు సమాధానం చెప్తూ ‘అది చిరంజీవి గారిని కావాలని కించపర్చడానికి చేసే వ్యాఖ్యలుగా నేను భావిస్తాను. ప్రతీ హీరో కి ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రజినీకాంత్ గారికి స్టైల్, అందుకు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఆయన సినిమాలను ఎవరైనా చూస్తారా చెప్పండి?, ఆయనకీ అవి ఎలాంటి బలమో, చిరంజీవి గారికి డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్, సెంటిమెంట్, డీసెంట్ స్టోరీ లైన్ అలాంటి బలం. గాడ్ ఫాదర్ లో వయస్సు కి తగ్గ పాత్రనే చేశారు కదా, దానికి ఎందుకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి వచ్చినంత రెవిన్యూ రాలేదు?’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.
ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో పెద్ద చిచ్చు పెట్టాయి. రజినీకాంత్ ఫ్యాన్స్ అనిల్ రావిపూడి మాటలను తప్పుబడుతున్నారు. రజినీకాంత్ అద్భుతంగా నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి, ఆయన నటన వల్ల సూపర్ హిట్ అయినా సినిమాల లిస్ట్ తీస్తే ఇండియా లో ఏ హీరో కూడా సరిపోరు, కేవలం స్టైల్ వల్లే ఆయన సినిమాలు ఆడడం లేదంటూ చెప్పుకొస్తున్నారు. అనిల్ రావిపూడి ఉద్దేశపూర్వకంగా రజినీకాంత్ ని ఉదాహరణగా తీసుకొని రాలేదు, కేవలం ఆయన ఒక వివరణ మాత్రమే ఇద్దామని అనుకున్నాడు, కానీ సోషల్ మీడియా లో అది మిస్ ఫైర్ అయ్యింది. ఆయన మాట్లాడిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
“Every hero has his own strengths – we can’t watch a #Rajinikanth garu film without BGM and style, just as audiences expect dance, fights, along with decent story in a #Chiranjeevi garu film” –#AnilRavipudi addresses comments on age factor pic.twitter.com/v1RuE9BvZu
— Vedi..VediGa… (@vedivediga) January 22, 2026