Telugu Cinema: ఇతర బాషల సినిమా కథలు చాలా ఇంటరెస్ట్‌గా ఉంటాయి, కానీ తెలుగు సినిమా కథలు ఉండవు ఎందుకని ? అంటూ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ముమ్మరంగా చర్చ జరుగుతుంది. తెలుగులోనూ గొప్ప కథలు వస్తున్నాయి అని కొందరు అంటుంటే.. లేదు రొటీన్ కథలకు తెలుగు సినిమా కేరాఫ్ అడ్రస్ అంటూ ఎగతాళి చేస్తున్నారు మరికొందరు. ఏది ఏమైనా కాలం మారుతుంటుంది. అలాగే సినిమా ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతుంటాయి

అందుకే, కథ మారకపోయినా కథనం మారాలి. కథనాలు మారాలి. మరి అలా మారాలి అంటే.. నైపుణ్యమున్న కథకులు రావాలి. విదేశీ సినిమాల దురాక్రమణతో ఆగిన మన సినిమా ప్రభ.. మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలి అంటే.. ఏదైనా కొత్తగా చేయాలి. తెలుగు భాషకి ఉన్న భావం, అలాగే వ్యాకరణ నియమం గొప్పది అంటూ ఇప్పటికే చాలా రకాలుగా పెద్దలు చెప్పారు.
మరి అలాంటి తెలుగు భాష సినిమాకి మరో స్థాయిలో గుర్తింపు ఉండాలి. కానీ ఆ గుర్తింపును మాత్రం మన టాలీవుడ్ ఇంకా నోచుకోలేదు. విదేశాల్లో కథ, కథన వ్యాఖ్యాన పరిణామ క్రమంతో పోల్చుకుంటే.. తెలుగు సినిమాల్లో కథలు ఎప్పుడు ముందజలోనే ఉన్నాయి. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిణమిస్తున్న అభిరుచులకభిముఖంగా మన కథలు మారలేదు.
తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన బాహుబలి సైతం రొటీన్ కథతోనే సాగింది. ఎందుకో తెలియదు గానీ, పాత్రలు, పాత్రల ఔచిత్యాలు మెరుగవుతూ ఎల్లలధిగమించాల్సిన తరుణంలోనూ మన తెలుగు సినిమా రచయితలు ఒక పరిధి పెట్టుకుని దానిలోనే ఈదుతూ కెరీర్ ను నెట్టుకొస్తుండటం దిగజారుడు తనమే.
Also Read: Akhanda Movie: అఖండ సినిమాలో ” నటించిన ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా ?
పదుల ఏళ్ళుగా మన సినిమా వేళ్ళను సంరక్షించిన అప్పటి మహా మహా రచయితల బోధనా విధానం నేటి రచయితల అశ్రద్ధకు బలై శిధిలమయ్యేపోయింది. అయితే, ఆ విధానాలు తిరిగి పుంజుకుంటేనే తెలుగు సినిమా పునాదుల పునరుద్ధరణ సాధ్యం అవుతుంది. ఆ దిశగా తెలుగు సినిమా వెళ్ళాలి అని ఆశిద్దాం.
Also Read: Prakash Raj: ‘మా’పై ప్రకాష్ రాజ్ పోరాటం ముగిసినట్లేనా!