Naga Chaitanya: నాగ చైతన్య ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఇప్పటికీ స్టార్ హీరో అయ్యేవాడా..?

తనదాకా వచ్చిన సినిమాలను చేజేతులారా వదిలేసుకొని ఇబ్బంది పడ్డ నాగచైతన్య, ప్రస్తుతం స్టార్ హీరోల రేసులో లేకపోవడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం అనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : March 6, 2024 2:17 pm

Naga Chaitanya Rejected Movies

Follow us on

Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగచైతన్య..ఈయన దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వాసు వర్మ డైరెక్షన్ లో వచ్చిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇక ఇది ఇలా ఉంటే నాగచైతన్య మాత్రం నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో ఆ తరువాత చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకొని అక్కినేని ఫ్యామిలీ కి మూడోతరం హీరోగా, అలాగే స్టార్ హీరోగా కొనసాగాలని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్నంత ఈజీగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో జరగలేదు. దానివల్లే ఆయన ఇప్పటికి కూడా స్టార్ హీరోగా మారలేకపోయాడు. ఇక ఆయన కెరియర్ లో ఒక రెండు సినిమాలను కనుక చేసి ఉంటే, ఆయన కచ్చితంగా స్టార్ హీరోగా గుర్తింపు పొందేవాడు. తనదాకా వచ్చిన సినిమాలను చేజేతులారా వదిలేసుకొని ఇబ్బంది పడ్డ నాగచైతన్య, ప్రస్తుతం స్టార్ హీరోల రేసులో లేకపోవడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం అనే చెప్పాలి…

అయితే నాగచైతన్య వదిలేసిన రెండు సినిమాలు ఏంటి అంటే వరుణ్ సందేశ్ హీరోగా, శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన కొత్త బంగారులోకం.. ఈ సినిమా కోసం మొదట దిల్ రాజు నాగచైతన్య ని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ నాగార్జున ఈ స్టోరీని రిజెక్ట్ చేయడం వల్ల నాగచైతన్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లోనే జోష్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు… ఇక వరుణ్ సందేశ్ చేసిన ‘కొత్త బంగారులోకం ‘ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది… ఇక అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘సుప్రీమ్ ‘ సినిమా కోసం మొదట నాగచైతన్య ను హీరోగా అనుకున్నారట.

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాలోకి సాయి ధరమ్ తేజ్ రావడం ఆయన ఈ సినిమా తో సక్సెస్ ను కూడా సాధించారు. ఇక ఈ సినిమాతో వరుణ్ తేజ్ కి హీరోగా మంచి ఇమేజ్ అయితే ఏర్పడింది. ఇక నాగచైతన్య, కొత్త బంగారులోకం, సుప్రీమ్ రెండు సినిమాలని కనక చేసినట్లయితే ఆయన కెరీయర్ ఇప్పుడు స్టార్ హీరోల రేంజ్ లో ఉండేదని చాలామంది సినీ విశ్లేషకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…