
Mahesh Tiger: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒడ్డు పొడువు అందానికి ఏ హాలీవుడ్ స్టార్ నో అనుకుంటారు. దేశంలోనే అందమైన హీరోగా మహేష్ బాబుకు పేరుంది. దక్షిణాదిలో ఈ హీరో అంటే తెలియని వారు ఉండరు. ఇక మహేష్ బాబు తన ఇమేజ్ ను పక్కనపెట్టి ఇతర అగ్రహీరోలతో మల్టీస్టారర్ మూవీలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ తో కలిసి మహేష్ నటించిన మూవీ అలరించింది.
అయితే బాలీవుడ్ లోకి మహేష్ వెళితే బాగుంటుందని అందరూ అంటున్నా.. ఆయన మాత్రం తెలుగుకే పరిమితమైపోతున్నాడు. నెక్ట్స్ రాజమౌళి సినిమాతో ఆ కోరికను తీర్చనున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేయబోయేది ప్యాన్ ఇండియా మూవీయే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించడం విశేషం. అయితే అది సినిమా కోసం కాదు.. ఒక యాడ్ కోసం.. అవును మహేష్ బాబు అడ్వటైజ్ మెంట్లలోనూ ఈ మధ్య నటిస్తున్నాడు. థమ్సప్ యాడ్ లో హీరో రణవీర్ సింగ్ పక్కన కలిసి నటించాడు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్ తోనూ నటించడం విశేషం.
మౌత్ ఫ్రెషనర్ బ్రాండ్ అయిన ‘పాన్ బహార్’ యాడ్ లో మహేష్ బాబు, బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఈ కమర్షియల్ షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా తాజాగా అభిమానులకు అలరిస్తూ ఆ యాడ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడిది మహేష్ బాబు అభిమానులకు కన్నుల విందు చేస్తోంది. వైరల్ గా మారింది.
View this post on Instagram