Idli Kottu Movie Trailer Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ధనుష్ ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే ‘కుబేర’ లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ ని కనక మనం చూసినట్లయితే ఒక చిన్న ఇడ్లీ కొట్టుతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వ్యక్తి ఒక కార్పొరేట్ హోటల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదుగుతాడు. అక్కడ తనకు గౌరవం లభించకపోవడం అలాగే వాళ్ళు చేసే ఫుడ్ లో క్వాలిటీ తగ్గిపోవడం వల్ల తిరిగి తన సొంత ఊరు వచ్చి తన వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే కార్పొరేట్ యజమన్యానికి ఇతనికి మధ్య జరిగిన తగాదాలో ఏం జరిగింది?అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించడం విశేషం…మరి ఈ సినిమా అక్టోబర్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ట్రైలర్ ను కనుక చూసినట్లయితే ఇందులో కథ మొత్తం చెప్పేసినప్పటికి సినిమాలో ఒక కోర్ ఎమోషన్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ధనుష్ సినిమాలో కథకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయిన కూడా కథనంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకుంటూ ఉంటాయి. అలాగే ఈ సినిమా మొత్తం ఫుడ్ అనే ఒక పాయింట్ తో తిరుగుతోంది. కాబట్టి దానికోసం వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడిని కట్టి పడేసేలా ఉంటాయనే విషయం అయితే తెలుస్తోంది…
ఇక మంచి ఫుడ్ అందించడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైన సరే క్వాలిటీ ఫుడ్ ని జనానికి అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఒక కుర్రాడు కథగా తెలుస్తోంది. మరి అతను అనుకున్నది తన ఇడ్లీ కొట్టు అనే హోటల్ ద్వారా చూసి చూపిస్తాడా? లేదా అతని ఇడ్లి కొట్టు ను మూయించడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నంలో ఓడిపోవాల్సి వస్తోందా?
అనేది ఈ మూవీలో మరో యాంగిల్ గా తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ధనుష్ దర్శకుడిగా ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక్కడి వరకు బాగున్నప్పటికీ ఈ టైలర్ ను చూస్తే ఇందులో కొన్ని మైనస్ పాయింట్ కూడా కనిపిస్తున్నాయి.
ఇడ్లీ కొట్టు అనే ఒక చిన్న పాయింట్ ను తీసుకొని సినిమా చేయడం అనేది కరెక్ట్ ఏనా? రెండున్నర గంటల పాటు దాని మీదే సినిమాని రన్ చేయగలుగుతారా? ఇప్పుడు మొత్తం గ్రాండ్ విజువల్స్, అదిరిపోయే సీజీ వర్క్ తో వండర్స్ ను క్రియేట్ చేస్తున్న సినిమాలను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు, ధనుష్ లాంటి స్టార్ హీరో ఇలాంటి చిన్న కాన్సెప్ట్ తో వస్తే ఈ మూవీని జనాలు ఆదరిస్తారా లేదా అనేది కూడా ఒక చిన్న డౌట్ గా ఉంది…దాన్ని తలుచుకుంటేనే భయం వేస్తోంది…