Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనియా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో కొనసాగుంతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూత్, మాస్ ఆడియన్స్ ఆయన ఏ మ్యానరిజం చేస్తే, ఆ మ్యానరిజం ని అనుసరిస్తున్నారు. ఆయన చెప్పే డైలాగ్స్ కి ప్రభావితం అయిపోతున్నారు. అందుకే ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు అల్లు అర్జున్ బ్రాండ్ ని ఒక రేంజ్ లో ఉపయోగించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అనేక ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వాళ్లకు యాడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా ఆయన చేతుల్లోకి ‘థమ్స్ అప్’ యాడ్ వచ్చి చేరింది. ఒకప్పుడు ఈ బ్రాండ్ కి మెగా చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత పోకిరి సినిమా నుండి మహేష్ బాబు చేతుల్లోకి ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన యాడ్స్ కాంట్రాక్టు వెళ్ళింది.
2006 వ సంవత్సరం నుండి 2023 వ సంవత్సరం వరకు ‘థమ్స్ అప్’ కి మహేష్ బాబు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్ళింది. పుష్ప 2 మూవీ విడుదలకు ముందు ఆయన ‘థమ్స్ అప్’ కాంట్రాక్టు కి ఒప్పుకున్నాడు. విడుదల తర్వాత ఈ యాడ్ టీవీ లో టెలికాస్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ కాంట్రాక్టు లో అల్లు అర్జున్ ఒక్కో యాడ్ వీడియో చేయడానికి అక్షరాలా 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తున్నాడట. ఇది ఇండియా లోనే ఆల్ టైం రికార్డు రెమ్యూనరేషన్ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఒకప్పుడు మహేష్ బాబు ఒక్కో థమ్స్ అప్ యాడ్ కోసం 6 నుండి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునేవాడట. ఇప్పుడు అల్లు అర్జున్ అంతకు రెండింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
5 ఏళ్ళ పాటు ‘థమ్స్ అప్’ యాడ్స్ కాంట్రాక్టు కి అల్లు అర్జున్ సంతకం చేసాడట. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి, మరికొన్ని పెద్ద కంపెనీలు కూడా అల్లు అర్జున్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేందుకు క్యూలు కడుతున్నారట. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా సెలెక్టివ్ గా బ్రాండ్స్ ని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక పుష్ప 2 తర్వాత ఆయన చేయబోయే సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా మీదనే ఆయన పూర్తి స్థాయిలో ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఈ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ ఈ నెలాఖరులో జరగనుంది అట. సుమారుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది.