Immadi Ravi Biopic: సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా Ibomma రవి(Immadi Ravi) నిగురించే చర్చలు నడుస్తున్నాయి. గడిచిన ఆరేళ్లలో ఎన్నో వేల సినిమాలను పైరసీ చేసి టాలీవుడ్ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రవి ని రీసెంట్ గానే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఇతని బయోగ్రఫీ కోసం తెగ వెతుకుతున్నారు. కొంతమంది అయితే ఆయన పుట్టినప్పటి నుండి, సినిమాలను పైరసీ చేసే స్థాయికి ఎదిగిన తీరు వరకు డేటా ని రెడీ చేసి పెట్టుకున్నారట. ఒక స్టార్ నిర్మాత ఇతని జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఒక సినిమా కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అతను ఏమైనా ఉత్తముడా?, అతని గురించి సినిమా తీయడం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు.
కానీ ఎన్నో ఏళ్ళ నుండి వేల సినిమాలను పైరసీ చేస్తూ,తన భార్య ఇతని వివరాలు చెప్పేంత వరకు పోలీసులకు కూడా దొరక్కుండా ఉన్నాడంటే ఇతని తెలివి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే మేకర్స్ ఇతని బయోగ్రఫీ పై సినిమా తియ్యడానికి సిద్ధం అయ్యారు. గత ఏడాది విడుదలైన ‘లక్కీ భాస్కర్’ సినిమాని మీరంతా చూసే ఉంటారు. పరిస్థితులు హీరో ని ఎలా అయితే దొంగని చేస్తాయో, రవి జీవితం లోని పరిస్థితులు కూడా అతన్ని ఇలా సైబర్ నేరగాడికి ఎలా నిల్చోబెట్టాయి అనేది వివరంగా చూపిస్తారట. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి సప్సెన్స్. ఇమ్మడి రవి తన జీవితం లో ఎన్నో దుర్భరమైన పరిస్థితులను ఎదురుకున్నాడట.
సమాజం లో తనకు ఎదురు అవుతున్న సమస్యలపై ఆయన చేసిన పోరాటం, ఆ క్రమం లో ఆయనకు నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడవడం వంటివి చాలానే జరిగాయట. అంతే కాకుండా రవి మరియు అతని టీం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి విషయాలను కూడా ఈ చిత్రం లో చూపిస్తాము అని అంటున్నారు. ఈ సినిమాని తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థ నిర్మించబోతోంది. ఇందులో హీరో క్యారక్టర్ కోసం దుల్కర్ సల్మాన్ లేదా ప్రదీప్ రంగనాథన్ వంటి హీరోలను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఈ ఇద్దరు హీరోలు చేస్తేనే ఈ చిత్రం ఎక్కువ మంది ఆడియన్స్ కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత వరకు కార్యరూపం దాలుస్తుంది అనేది.