https://oktelugu.com/

దానికి నేను దూరంగా ఉండలేను – కృతి సనన్

హీరోయిన్ ‘కృతి సనన్’ మోడల్ గా వర్క్ చేస్తూ అవకాశాల కోసం అందరి చుట్టూ తిరుగుతున్న రోజులు అవి. అందం అభినయం అంతకుమించి ఆకట్టుకునే అంశాలు ఆమెలో పుష్కలంగా ఉన్నా.. ఎందుకో ఆమెకు ఆ సమయంలో పెద్దగా హిందీ సినిమాల్లో అవకాశాలు రాలేదు. అప్పుడే కృతి సనన్ నిర్ణయించుకుంది. నటిస్తే అవకాశాలు రావు, చేసే పాత్రలో జీవిస్తే ఛాన్స్ లు వస్తాయి అని ఆమె బలంగా నమ్మింది. అప్పటినుండి ఆమె అదే ఫాలో అవుతుంది. కట్ చేస్తే.. […]

Written By:
  • admin
  • , Updated On : May 15, 2021 / 12:14 PM IST
    Follow us on

    హీరోయిన్ ‘కృతి సనన్’ మోడల్ గా వర్క్ చేస్తూ అవకాశాల కోసం అందరి చుట్టూ తిరుగుతున్న రోజులు అవి. అందం అభినయం అంతకుమించి ఆకట్టుకునే అంశాలు ఆమెలో పుష్కలంగా ఉన్నా.. ఎందుకో ఆమెకు ఆ సమయంలో పెద్దగా హిందీ సినిమాల్లో అవకాశాలు రాలేదు. అప్పుడే కృతి సనన్ నిర్ణయించుకుంది. నటిస్తే అవకాశాలు రావు, చేసే పాత్రలో జీవిస్తే ఛాన్స్ లు వస్తాయి అని ఆమె బలంగా నమ్మింది.

    అప్పటినుండి ఆమె అదే ఫాలో అవుతుంది. కట్ చేస్తే.. బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. రెండేళ్లలోనే అమ్మడు హీరోయిన్ గా బాగా సక్సెస్ అయిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ రేంజ్ ను సంపాదించుకుంది. అయితే ఇదంతా అంత ఈజీగా రాలేదని చెబుతుంది ఈ హాట్ బ్యూటీ.

    తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతీ సనన్‌ పలు ఆసక్తికరమైన అంశాలు గురించి చెప్పుకొచ్చింది. ‘కెమేరా ముందుకు వెళ్తే తానూ అన్నీ మర్చిపోతాను’ అని చెప్పుకుంటుంది. ఇంకా కృతీ సనన్‌ మాట్లాడిన మాటలు వింటే.. ‘ఈ కరోనా వల్ల గత ఏడాది ఎక్కువగా నాకు షూటింగ్స్‌ లో పాల్గొనే ఛాన్స్ రాలేదు. దాంతో జీవితంలో మొదటిసారి పని లేకుండా ఇంట్లోనే నెలలు తరబడి ఖాళీగా కూర్చున్నాను.

    మళ్ళీ ఎప్పుడెప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయా అని ఆశగా ఎదురుచూశాను. ఈ లాక్ డౌన్ సమయంలో నా గురించి నాకు అర్థమైనది ఏమిటంటే.. నేను కెమేరాకి ఎక్కువ కాలం దూరంగా ఉండలేను. నాకు షూటింగ్ అంటే అంత ప్రేమ. అందుకేనేమో నేను కెమేరా మందుకు వెళ్ళగానే నా వ్యక్తిగత విషయాలను పూర్తిగా మరచిపోతాను’ అంటూ కృతీ సనన్‌ కబుర్లు చెప్పుకొచ్చింది.