Samantha: సమంత ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలుపెడుతుంది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి.. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తోంది. ఐతే ఆ ఆశలు, ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉన్నాయని ఆమె ఎమోషనల్ అవుతూ చెప్పడం అందర్నీ కదిలించింది. సమంత తాజాగా ‘సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్’ అనే కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యింది. .
ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. ‘ఎవరి జీవితం అద్భుతంగా ఉందడు. నేను కూడా జీవితంలోనూ ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు అనుభవించాను. అయితే, నాకు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలబడ్డారు. నువ్వు వైద్యుల సాయం తీసుకోవాలని వాళ్లే నాకు సూచించారు. నేను ఈ రోజు ధైర్యంగా నిలబడేందుకు నాకు ఎందరో సాయం చేశారు.
కానీ, జీవితంలో నేను కూడా చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నాను’ అంటూ సమంత ఎమోషనల్ గా చెప్పింది. ఆమె హైదరాబాద్‌లో ‘రోష్ని ట్రస్ట్’ ఏర్పాటు చేసిన ‘సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్’ కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా చెప్పుకొచ్చింది. ఐతే, ఈ రోష్ని ట్రస్ట్ కార్యక్రమంలో సామ్ మానసిక వైద్యల గురించి చాలా బాగా చెప్పింది. ‘శరీరానికి దెబ్బ తగిలితే వైద్యుల వద్దకు వెళ్లినట్లే, మనసుకు గాయం అయినప్పుడు కూడా మనం మానసిక వైద్యులను సంప్రదించాలని సామ్ చెప్పుకొచ్చింది.
ఏది ఏమైనా . 2021 వ సంవత్సరం సమంతకు చేదు అనుభవాలు మిగిల్చింది. ఆమెను 2021లో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మానసిక ప్రశాంత కోల్పోయింది. పైగా సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంది. సమంతకు 2021 పెద్ద పీడకలగా మిగిలిపోయింది. మరి కనీసం 2022 లో ఆమె జీవితంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా సాగాలని ఆశిద్దాం.
Also Read: Varma: ఆ పాట అంటే ఎంతో ఇష్టం కానీ.. పిక్చరైజేషన్ నచ్చలేదంటున్న వర్మ..!
ఇక కెరీర్ పరంగా సమంత ఫుల్ ఫామ్ లో ఉంది. సామ్ నటించిన రెండు పాన్ ఇండియా చిత్రాలు శాకుంతలం, యశోద చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. పైగా ఈ రెండు సినిమాలు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతున్నాయి.
Also Read: Jacqueline Fernandez: మీ సొంత వాళ్ళకు ఇలా చేయరు కదా.. హీరోయిన్ విన్నపం !