Manchu Vishnu: మా అధ్యక్షడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తనపై నెగిటివ్ ప్రచారం మొదలైందని తెలియజేశాడు. జిన్నా మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండగా ఐటెం రాజా మళ్ళీ నిద్ర లేచాడంటూ ట్వీట్ చేశాడు. తాను అనని మాటలు అన్నట్లు స్ప్రెడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఆదిపురుష్ సినిమాపై మంచు విష్ణు నెగిటివ్ కామెంట్స్ చేసినట్లు ఓ వార్త హల్చల్ చేస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంచు విష్ణు.. ప్రేక్షకులకు సినిమా ఎలా ఉంటుందో ఒక స్పష్టత ఇవ్వాలి. ఆదిపురుష్ విజువల్స్ కార్టూన్ మూవీని తలపిస్తున్నాయి. ప్రేక్షకులు ఆదిపురుష్ నుండి ఇలాంటిది ఊహించకపోవడంతో వారు బాగా నిరాశ చెందారు. అందుకే ఇలాంటి ఫలితం వచ్చింది, అని అన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ఈ కథనాలపై మంచు విష్ణు స్పందించారు. జిన్నా మూవీ రిలీజ్ దగ్గర పడుతుండగా ఎప్పటిలాగానే ఐటెం రాజా నాపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఆదిపురుష్ చిత్రం పై నేను అలాంటి కామెంట్స్ చేయలేదు, అని ట్విట్టర్ పోస్ట్ చేశారు. ప్రభాస్ మూవీ పై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదని వివరణ ఇచ్చాడు. అలాగే మా సభ్యత్వం కావాలంటే హీరో, హీరోయిన్ కనీసం రెండు సినిమాలలో నటించాలి. అవి థియేటర్స్ లో లేదా ఓటీటీలో విడుదలై ఉండాలని, నేను మాట్లాడినట్లు కూడా ప్రచారం చేస్తున్నారు అందులో కూడా నిజం లేదని మంచు విష్ణు అన్నారు.
ఇటీవల మంచు విష్ణు ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై ట్రోల్స్ కి పాల్పడుతుంది ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఒక ప్రముఖ నటుడి ఆఫీస్ నుండి నాపై ట్రోల్స్ స్ప్రెడ్ చేస్తున్నారని, ఐపీ అడ్రెస్లు దొరికాయంటూ వెల్లడించారు. ఆ నటుడు ఎవరన్నది మంచు విష్ణు వెల్లడించలేదు. ఇప్పుడు కూడా ఆయనను ఉద్దేశించే మంచు విష్ణు ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.

కాగా మంచు విష్ణు జిన్నా టైటిల్ తో ఒక మూవీ చేశారు. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈశాన్ సూర్య దర్శకుడు. ఈ మూవీ అక్టోబర్ 21న విడుదల కానుంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. జిన్నా ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. జిన్నాతో మంచు విష్ణు హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.