Rakul Preet Singh: అవకాశాల కోసం మొదట్లో అలా చేశాను… రకుల్ సీరియస్ కామెంట్స్

2016 రకుల్ కి బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఆ ఏడాది రకుల్ నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వరుస విజయాలతో రకుల్ హ్యాట్రిక్ కొట్టింది.

Written By: Shiva, Updated On : October 7, 2023 9:47 am

Rakul Preet Singh

Follow us on

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగులో రకుల్ మొదటి సినిమా కెరటం. ఈమెకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బ్రేక్ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలోని నటనతో రకుల్ ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది. గోపీచంద్ కి జంటగా నటించిన లౌక్యం సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. కిక్ 2లో రవితేజతో జతకట్టిన రకుల్ బ్రూస్ లీ చిత్రంలో ఏకంగా రామ్ చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది.

2016 రకుల్ కి బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఆ ఏడాది రకుల్ నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వరుస విజయాలతో రకుల్ హ్యాట్రిక్ కొట్టింది. దాంతో స్టార్ హీరోయిన్ గా అవతరించింది. మహేష్ కి జంటగా స్పైడర్ మూవీలో నటించింది. పవన్, ప్రభాస్ తప్పితే అందరు స్టార్స్ తో రకుల్ ఆడిపాడింది. టాలీవుడ్ లో జోరు తగ్గుతున్న తరుణంలో రకుల్ ఫోకస్ బాలీవుడ్ మీదకు మళ్లించింది.

గత రెండేళ్లుగా హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తుంది. చెప్పాలంటే రకుల్ కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. అయితే ప్రారంభంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారట. హీరోయిన్ గా ఎదిగే క్రమంలో ఎదురైన ఇబ్బందులను రకుల్ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. హీరోయిన్ కావాలనే ఆశతో ఒంటరిగా ముంబై వచ్చాను. నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అది. ఇక అవకాశాల కోసం క్యూలలో నిల్చున్నాను.

రోజూ క్యాస్టింగ్ ఏజెంట్స్ కి దర్శకులకు ఫోన్లు చేసేదానిని… అని రకుల్ అన్నారు. చాలా సినిమాల్లో ఆఫర్ దక్కినట్లే దక్కేవి. చివరకు వేరే వాళ్ళు నటించేవారు. హీరోయిన్ గా నా ప్రయాణం ఎన్నో పాఠాలు నేర్పింది. కుటుంబ సభ్యుల మద్దతుతో నేను ఈ స్థాయికి రాగలిగాను, అని ఆమె చెప్పుకొచ్చారు. రకుల్ 2021లో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రియుడిగా పరిచయం చేసింది.