
దక్షిణాదిలో.. హిందీలో నటిస్తూ నంబర్ 1 హీరోయిన్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. తలుచుకొని గుక్కపట్టి ఏడ్చేశారు. తాజాగా తన బిజీ లైఫ్ లో చిన్న విరామం తీసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్ లో సినిమా చూశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ వీక్షించిన రకుల్ ప్రీత్ సింగ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారట..
ఈ విషయాన్ని తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొని భావోద్వేగానికి గురయ్యారు. చాలా నెలల తర్వాత థియేటర్ లో సినిమా చూడడం ఆనందంగా ఉందని.. స్క్రీన్ టైటిల్స్ ప్రారంభం కాగానే భావోద్వేగానికి గురయ్యానని.. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ అయ్యారు.
ఇలాంటి కరోనా క్లిష్ట సమయంలో థియేటర్ లో సినిమా విడుదల చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తోపాటు ‘బెల్ బాటమ్’ చిత్రబృందం మొత్తాన్ని రకుల్ ప్రీత్ సింగ్ అభినందించారు. వారి సాహసానికి కృతజ్ఞతలని.. ప్రేక్షకులకు మంచి సినిమా చూపించారని తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో 6 సినిమాల వరకు ఉన్నాయి. తెలుగులో కొండపొలం సినిమా చేస్తోంది. తమిళంలో ‘భారతీయుడు2’ సినిమా చేస్తోంది. ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్, ఆయులాన్ తోపాటు బాలీవుడ్ లో ‘ఎటాక్’, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ వంటి సినిమాల్లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.