
నటుడు నిర్మాత బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఎప్పుడూ సంచలనమే. ఆయన సీరియస్ గా కామెంట్ చేసినా, దాని భావం జనాలకు సిల్లీగా తోస్తుంది. సాధారణ కమెడియన్ గా ప్రస్థానం మొదలుపెట్టిన బండ్ల గణేష్, స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగారు. ఈ విషయం అనేక అనుమానాలకు దారి తీసింది. ఈయన కనీసం స్టార్ కమెడియన్ కూడా కాదు, కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయగల నిర్మాత ఎలా అయ్యాడు అని అందరూ అనుకున్నారు . ఈ నేపథ్యంలోనే ఓ వర్షన్ బయటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ శాఖలలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ బినామీనే ఈ బండ్ల గణేష్ అన్న వాదన బయటికి వచ్చింది. లిక్కర్ కింగ్ గా పేరున్న బొత్స సత్యనారాయణ బ్లాక్ మనీని వైట్ గా మార్చడానికి కమెడియన్ బండ్ల గణేష్ ని నిర్మాతను చేశాడని విపరీతమైన ప్రచారం జరిగింది.
ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా
తాజా ఇంటర్వ్యూలో ఈ కథనాలపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. మంత్రి బొత్స సత్యనారాయణ బినామీగా నాపై పడ్డ ముద్ర నన్ను బాగా బాధ పెట్టిందని గణేష్ చెప్పారు. బొత్స సత్యనారాయణతో 20ఏళ్లకు పైగా అనుబంధం ఉంది అన్నారు. మాగంటి బాబు ద్వారా నాకు బొత్స పరిచయం అయ్యారు. అలా జరిగిన పరిచయం మామధ్య అన్నదమ్ముల బంధంలా బలపడింది అన్నారు. ఐతే అందరూ అనుకుంటున్నట్లు ఆయన ఆస్థులకు నేను బినామీ కాదని గణేష్ కుండ బద్దలు కొట్టారు. ఇక సినిమా పరిశ్రమలో సంపాదించారా, పౌల్ట్రీ పరిశ్రమల ద్వారా సంపాదించారా అన్న ప్రశ్నకు ఆయన నిర్మొహమాటంగా సినిమాల ద్వారా చాల సంపాదించానని చెప్పారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!
పరోక్షంగా ఆయన బొత్స ఆస్థులతో నాకు ఎటువంటి సంబంధం లేదని, నేను పరిశ్రమల ద్వారా సినిమా ద్వారా డబ్బులు సంపాదించి ఎదిగాను అని తెలిపారు. ఇక గణేష్ కోవిడ్ బారిన పడిన సమయంలో బొత్స సత్యనారాయణ రోజూ పోను చేసి యోగక్షేమాలు అడిగారని ఆయన చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. బినామీ కాబట్టే ఆస్థులపై బెంగతో బొత్స సత్యనారాయణ ఆయన ఆరోగ్యం పట్ల వాకబు చేశారని కొందరు అంటున్నారు. 2015 లో కాంగ్రెస్ నుండి వైసీపీ లో చేరిన బొత్స మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్నారు. బొత్స వైసీపీ మంత్రి అయిన తరువాత ఒక్కసారి కూడా కలవలేదు అన్నారు బండ్ల గణేష్. ఇక వీరిద్దరి మధ్య బినామీ బంధంలో ఉందో లేదో వారికే తెలియాలి.