Hyper Aadi-Roja : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో కమెడీయన్ గా నటిస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే జనసేన తరఫున రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీకి అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అందుకే ఏ కార్యక్రమం చేపట్టినా ఆది ఉండేలా చూస్తున్నారు. మిగిలిన పార్టీలకు చురకలంటిస్తూ ఆది మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ నేతలను పేరు పేరున ప్రస్తావిస్తూ కౌంటర్లు వేస్తాడు. కానీ ఇప్పుడు వైసీపీ కార్యకర్లను పొగడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
అసలు సంగతికొస్తే.. జబర్దస్త్ టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం కేసీఆర్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గరుడవేగ’ ఫేమ్ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనన్య కృష్ణన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా రీలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మాజీ మంత్రులు హరీష్ రావు, రోజాతో పాటు జానీ మాస్టర్, శివ బాలాజీ, సుధీర్, ఆది, చంటితో పాటు పలువురు ‘జబర్దస్త్’ కమెడియన్లు పాల్గొన్నారు. మొన్నటివరకు ఉప్పు నిప్పులా ఉన్న ఆది, రోజా ఒకే వేదిక పై కనిపించడం చూసి పలు పలు రకాలు చర్చించుకోవడం మొదలు పెట్టారు.. ఆది ఇలా చేస్తాడా అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. అసలు ఆది ఏం మాట్లాడారో అని తెగ ఆందోళనపడ్డారు. మొత్తానికి వాళ్ల ఊహే నిజమైంది..
ఇక ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ ‘ముందుగా అందరికి నమస్కారం, ఈ రోజు ఈవెంట్ కు విచ్చేసిన రోజా గారికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో చాలా మంది హైపర్ ఆది రోజాని ఏమన్నాడో తెలుసా అంటూ పెద్ద పెద్ద థంబ్ నెయిల్స్ పెట్టి రాస్తుంటారు. నేను ఇంతవరకు ఈమెని ఎప్పుడు ఏమి అనలేదు. అసలు అనను కూడా. నిజంగా ఎప్పుడు ఏమి అనలేదు. అయినా సరే ఏదో అన్నట్లు రాస్తారు. సరే రాసుకొండి మీ వ్యూస్ కోసం ఏదో ఒకటి రాయాలి.. ఇక ఒకప్పుడు నేను అ స్టేజ్ నుంచే వచ్చాం అని అంటాడు. ఇక అందరికి షాక్ ఇస్తూ పుష్ప టీమ్ గురించి మాట్లాడాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తెలుగు సినిమా వైభవం పెరుగుతుంది. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ మూడు వెయ్యి కోట్లు సినిమాలు, పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పొలిటికల్ గా గెలవడం టాలీవుడ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు.. దీపావళికి వచ్చిన మూడు చిత్రాలను హిట్ చేశారు. ‘లక్కీ భాస్కర్’కు ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదు. ‘అమరన్’ చూసి కంటతడి పెట్టుకున్నారు. కిరణ్ అబ్బవరం ‘క’ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కంటే ముందు కిరణ్ అబ్బవరం ఏం చేసినా ట్రోల్ చేసే వాళ్లు, ఆయన ఇప్పుడు నడిస్తే ట్రెండ్ అవుతోంది. అలాంటి పరిశ్రమలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సడెన్ గా ఇంత మార్పేంటి? కొత్తగా ఈ భజనేంటి అని వైసీపీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. ఇక సినీ విశ్లేషకులు సైతం ఇదే విషయం పై చర్చలు జరుపుతున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hyper adis comments on ex minister roja went viral in social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com