https://oktelugu.com/

 మెగా హీరో మూవీకి భారీ ఆఫర్.. డీల్ కుదిరినట్టేనా?

మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. మెగా ఫ్యామిలీ సపోర్టుతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తేజు కెరీర్ తొలినాళ్లలోనే మంచి హిట్లు సాధించాడు. ఆ తర్వాత కొద్దిరోజులు ప్లాపులతో సతమతమయ్యాడు. అయితే ఇటీవల వరుస హిట్లతో సాయిధరమ్ తేజ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో సాయిధరమ్ తేజు సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. Also Read: లాస్య రచ్చ పై గీతా మాధురి కౌంటర్ ! ‘సుప్రీమ్’ మూవీ హిట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 / 03:12 PM IST

    saidaramtez

    Follow us on


    మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. మెగా ఫ్యామిలీ సపోర్టుతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తేజు కెరీర్ తొలినాళ్లలోనే మంచి హిట్లు సాధించాడు. ఆ తర్వాత కొద్దిరోజులు ప్లాపులతో సతమతమయ్యాడు. అయితే ఇటీవల వరుస హిట్లతో సాయిధరమ్ తేజ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. దీంతో సాయిధరమ్ తేజు సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

    Also Read: లాస్య రచ్చ పై గీతా మాధురి కౌంటర్ !

    ‘సుప్రీమ్’ మూవీ హిట్టు తర్వా0త తేజు వరుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. అయితే ‘చిత్రలహరి’.. ‘ప్రతిరోజూ పండగే’ మూవీలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాల తర్వాత హ్యాట్రిక్ విజయం సాధించాలనే కసితో ‘సోలో బ్రతుకే సోబెటర్’ మూవీ చేశాడు. సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ తప్పకుండా హిట్ సాధిస్తుందనే నమ్మకంతో తేజు ఉన్నాడు.

    Also Read: ‘మెగాస్టార్’ను వదలనంటున్న రాంచరణ్..!

    ‘సోలో బ్రతుకే సోబెటర్’ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్.. టీజర్.. ట్రైలర్.. సాంగ్స్ అన్నింటికీ మంచి ఆదరణ లభించింది. మంచి కమర్షియల్ అండ్ ఎంటైట్మెంట్ అంశాలతో ఈ సినిమా యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈ మూవీలో సాయిధరమ్ తేజుకు జోడీ నభా నటేష్ నటిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా కరోనాతో వాయిదా వేయాల్సి వచ్చింది.ప్రస్తుతం టాలీవుడ్లోని కొత్త సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ‘సోలో బ్రతుకే సోబెటర్’ ఓటీటీ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. జీ-5 ఈ మూవీ డిజీటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏకంగా రూ.30కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. జీ-5 భారీ రేటు ఇవ్వడంతో వారికి డిజిటల్ రైట్స్ అమ్మేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.. అంతవరకు మనమంతా వేచి చూడాల్సిందే..!