Devara: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర సినిమా మీద అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఎన్టీయార్ కూడా తనని తాను పాన్ ఇండియా లెవెల్ లో ఒక స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఈ సినిమా తనకు కీలకంగా మారనుంది.
ఎందుకంటే ఇంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమాలో ఆయన పాన్ ఇండియా హీరోగా అరంగేట్రం చేసినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కొట్టేశాడు.ఇక సోలో హీరోగా ఈ సినిమాతో ఎన్టీయార్ మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇలాంటి క్రమం లోనే ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ ఇక్కడ తగ్గకుండా భారీ రేంజ్ లో ఖర్చుపెట్టి ప్రతి సీన్ ని అనుకున్నది అనుకున్నట్టు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఈ సినిమాని చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం 1000 మందితో ఒక ఫైట్ చిత్రీకరిస్తున్నాట్టు గా తెలుస్తుంది. ఇక దీని కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ వచ్చి ఈ ఫైట్ ని కంపోజ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక దీనికి సంబంధించిన షూట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పెద్ద సెట్ వేసి చేస్తున్నారట. అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ విషయాలు లీక్ అయ్యాయి. అయితే ఈ ఫైట్ లో ఎన్టీఆర్ తన ఉగ్రరూపం చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇండియాలోనే ఇప్పటివరకు ఇలాంటి ఫైట్ ని ఎక్కడ ఏ సినిమాలో తీయలేదు.
ఇక ఇవి ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ కొరటాల ఇద్దరు కలిసి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తానికి ఒకే దెబ్బతో పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు మొత్తం తిరగరాయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ఫిబ్రవరి లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు గా తెలుస్తుంది…