Hrithik Roshan: లవ్ ఎఫైర్​ నడిపిస్తోన్న స్టార్ హీరో మాజీ భార్య.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్​ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు.. ఒక్క ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు.. భారతదేశమంతటా ఈ సిక్స్​ప్యాక్ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, హృతిక్​కు వివాహమై విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. తన భార్య సుసానే కాన్​తో 2014లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి హృతిక్​ ఒంటరిగానే జీవిస్తున్నారు. Also Read: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన… బాలీవుడ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 22, 2021 2:53 pm
Follow us on

Hrithik Roshan: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్​ రోషన్​ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్​ అంతా ఇంతా కాదు.. ఒక్క ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు.. భారతదేశమంతటా ఈ సిక్స్​ప్యాక్ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. కాగా, హృతిక్​కు వివాహమై విడాకులు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. తన భార్య సుసానే కాన్​తో 2014లో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి హృతిక్​ ఒంటరిగానే జీవిస్తున్నారు.

Hrithik Roshan

Also Read: మహారాష్ట్ర మంత్రి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన… బాలీవుడ్ నటి హేమ మాలిని

అయితే, సుసానే మాత్రం నటుడుఅర్స్లాన్ గోనితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి రిలేషన్​కు సంబంధించి అనేక వార్తలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హృతిక్​తో విడిపోయిన తర్వాత ఎక్కడ కనిపించినా.. అర్స్లాన్ గోని పక్కనే ఉండటంతో జనాల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా, సుసానే, తన ప్రియుడు అర్స్లాన్ గోనికి పుట్టిన రోజు విషెష్​ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

నిన్న(అంటే డిసెంబరు20)న సుసానే అర్స్లాన్ గోని బర్త్ డే సందర్భంగా అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోను సోషల్​ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్​డే.. నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు దొరకాలని, నీ చుట్టూ స్వచ్చమైన ప్రమ నిండి ఉండాలని కోరుకుంటున్నా.. ఇప్పటి వరకు నా జీవితంలో నేను చూసిన అత్యంత పవర్​ఫుల్ పర్సన్ నువ్వే.. అంటూ చెప్పుకొచ్చింది. దీనికి అర్స్లాన్ రిప్లైగాా.. లవ్​యూ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం నిజమేనని బాలీవుడ్​లో అనుకుంటున్నారు. అయితే, ఇది పెళ్లివరకు వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: బాలీవుడ్ లో మరో కలకలం… ఐశ్వర్య రాయ్ కి ఈడీ సమన్లు