Homeఎంటర్టైన్మెంట్Pavan Kalyan Third Wife Assets: పవన్ మూడో భార్య పేరిట ఎన్ని ఆస్తులున్నాయి?

Pavan Kalyan Third Wife Assets: పవన్ మూడో భార్య పేరిట ఎన్ని ఆస్తులున్నాయి?

Pavan Kalyan Third Wife Assets: పవన్ కల్యాణ్ పేరు చెబితే ఎవరికైనా పవర్ రావాల్సిందే. ఆ పేరు వింటే ఊగిపోవాల్సిందే. అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న ఘనత ఆయనకే సొంతం. ఆయన పేరు స్ర్ర్ర్కీన్ మీద చూస్తేనే పిచ్చెక్కిపోయేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక ఆయన సినిమాల్లో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆయన మాటలకు పాటలకు ఫైట్లకు చప్పట్లు కొట్టని వారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగులో ఆయనకున్నంత మంది అభిమానులు ఏ హీరోకు కూడా లేరనేది వాస్తవమే. అంతటి ఘనత సాధించిన పవన్ కల్యాణ్ మాత్రం బయట ఓ మామూలు వ్యక్తిలాగేనే కనిపిస్తారు. అది ఆయన వ్యక్తిత్వం. ఎంత ఎదిగినా ఒదగాలన్నదే ఆయన సిద్ధాంతం. అందుకే అంత సాధారణంగా కనిపిస్తారు.

Pavan Kalyan Third Wife Assets
pawan kalyan anna lezhneva

ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి పెళ్లి స్వయంగా చిరంజీవి దగ్గరుండి చేశారు. పేరు నందిని. వైజాగ్ అమ్మాయి. పెళ్లయిన ఏడాదికే మనస్పర్దలు వచ్చి విడిపోయారు. తరువాత బద్రి, జానీ సినిమాల్లో తనతో హీరోయిన్ గా చేసిన రేణుదేశాయ్ ని ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో రెండో వివాహం చేసుకున్నారు. ఆమెను కూడా వదిలిపెట్టాడు. తరువాత తీన్ మార్ సమయంలో మూడో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు అన్నాలెజ్ నోవా.

Also Read: Mahesh-Rajamouli Movie: మహేష్-రాజమౌళి మూవీ సెట్ అయ్యింది ఎవరి వల్లనో తెలుసా?

ఈమె రష్యా దేశస్తురాలు. అక్కడ మోడలింగ్ లో మంచి పేరు తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ తో పెళ్లి తరువాత ఆమె హిందూ మతంలోకి మారింది. 2011 లో తీన్మార్ సమయంలోనే వీరి సహజీవనం మొదలైంది. వీరికి కూడా ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు మార్క్ శంకర్ పవనో కాగా కూతురు పేరు పొలెనా అంజనా పవనో గా నామకరణం చేశారు. దీంతో వీరి జీవితం సుఖమయంగానే సాగుతోంది. వీరి కాపురంలో ఎలాంటి మనస్పర్దలు లేకుండా గడిచిపోతోంది.

Pavan Kalyan Third Wife Assets
pawan kalyan anna lezhneva

ఇక అన్నాలెజ్ నోవా ఆస్తుల విలువ తెలిస్తే షాకే. ఆమె పేరిట రూ.1600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఆస్తులెలా వచ్చాయంటే ఆమె ఇదివరకే మోడల్ కావడంతో కొంత ఆస్తి కూడబెట్టగా పవన్ కల్యాణ్ కూడా ఆమె పేరిట సింగపూర్ లో కొన్నిఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆస్తుల విలువ అంతలా పెరిగిపోయింది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 నుంచి 60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. జనసేన పార్టీతో రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. సీఎం కావాలనే పవన్ కల్యాణ్ ఆశ తీరుతుందో లేదో 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి.

Also Read:Virata Parvam Movie Review: విరాటపర్వం మూవీ రివ్యూ..

 

పవన్ కళ్యాణ్ 3 భార్య ఆస్తుల వివరాలు || Pavan Kalyan Third Wife Assets || Anna Lezhneva

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version