Leo Movie: లియో సినిమాలో 100 మంది తో ఫైట్ అది ఎలా ఉంటుందంటే..?

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది.

Written By: Gopi, Updated On : October 11, 2023 8:50 am

Leo Movie

Follow us on

Leo Movie: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల్లో ఇళయ దళపతి విజయ్ ఈయన తీసిన చాలా సినిమాలు తమిళ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఒకప్పుడు ఈయన చాలామంది హీరోయిన్లతో కూడా సినిమాలు చేసి వాళ్ళకి ఒక మంచి గుర్తింపును ఇచ్చారు.ఈయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు తెలుగు నుంచి రీమేక్ చేయడం జరిగింది.అందులో ముఖ్యంగా ఒక్కడు,పోకిరి లాంటి సినిమాలు తమిళంలో రీమేక్ చేసి మంచి పేరుని సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో లియో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది.ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో సినిమాకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా వంద మందితో ఫైట్ అనేది ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫైట్ లో అద్భుతంగా చేసి మెప్పించాలని కొన్ని షాట్లలో అయితే డూప్ లేకుండా తనే స్వయంగా చేశారని ఈమధ్య ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ సినిమా డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ చెప్పడం జరిగింది.

ఇక ఇలాంటి క్రమంలో లియో సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. వంద మందితో చేసే ఫైట్ ఈ సినిమాకి హైలెట్ గా నిలచి పోతుందని తెలుస్తుంది. అలాగే ఆ ఫైట్ ఎలా ఉంటుందో దాన్ని ఊహించడం ఎవరి తరం కాదని అలాగే సినిమాలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుందని ఆ ట్విస్ట్ ఈ సినిమాకి చాలా కీలకం కానుంది అని కూడా తెలుస్తుంది.

ఇక విజయ్ ప్రస్తుతం తెలుగు మార్కెట్ మీద కూడా కన్నేశాడు ఇప్పటికే ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయినప్పటికీ ఆ సినిమాలు ఆయనకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దాంతో ఇప్పుడు చేస్తున్న లియో సినిమా మీద ఆయన భారీ అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కనుక తెలుగులో మంచి సక్సెస్ అయితే తెలుగు మార్కెట్ కూడా ఆయనకు విపరీతంగా పెరుగుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.అందుకే ఆయన చాలా దగ్గరుండి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాడు ఇక రీసెంట్ గా వచ్చిన వారసుడు సినిమా తెలుగులో ప్లాప్ అయింది. ఇక తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఏర్పడాలంటే తెలుగులో మంచి మార్కెట్ ఉన్న లోకేష్ కనకరాజ్ వల్లనే అవుతుంది అని ఈ సినిమాకోసం ఆయనని ఎంచుకోవడం జరిగింది.

ఇక ఇది ఇలా ఉంటే ఆయన సినిమా కనక హిట్ అయితే ఆయనకి తెలుగులో మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రస్తుతం లియో సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు గా తెలుస్తుంది. అందులో భాగంగానే కొన్ని షాట్లలో తనే స్వయంగా డూప్ లేకుండా చేయడం జరుగుతుంది. సినిమా యూనిట్ వద్దు డూప్ ని వాడుదాం అని ఎంత చెప్పినా కూడా వినకుండా అసలు డూపులను వాడకుండా తనే కొన్ని రిస్కీ షాట్స్ ను కూడా చేశాడు. సక్సెస్ అనేది ఇప్పుడు ఆయనకి చాలా అవసరం అందుకే ఆయన చాలా ఫీట్లను కూడా చేస్తున్నారు….