Sivaji fires at Priya Shetty: మూడవ వారం ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) నుండి ఎవ్వరూ ఊహించని విధంగా ప్రియ శెట్టి ఎలిమినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కచ్చితంగా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు, ఎందుకంటే ఆమెకు అసలు స్క్రీన్ స్పేస్ రావడం లేదు. అయినప్పటికీ కూడా ఆమె సేవ్ అవ్వడం, బోలెడంత కంటెంట్ ఇస్తున్న ప్రియ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. ఆమె ఎలిమినేట్ అయ్యాక స్టేజి మీద, అదే విధంగా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ లో బాగా ఏడ్చిందట. బజ్ ఇంటర్వ్యూ లో అయితే శివాజీ ఇంటర్వ్యూ షూటింగ్ ని మధ్యలో ఆపి మరీ ఓదార్చాడట. కానీ ఇదంతా ఎపిసోడ్స్ లో చూపించలేదు. అయితే బిగ్ బాస్ బజ్ హోస్ట్ లో శివాజీ ప్రియ ని అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశాడు. ఆడియన్స్ ఆమెలో ఏది నచ్చక ఓటు వెయ్యకూడదు అనుకున్నారో, అదంతా ఆమెకు అర్థం అయ్యేలా చేసాడు.
ముందుగా ప్రియ రాగానే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ప్రియ మరియు ఆమె గ్యాంగ్ కూర్చున్న ఫోటోని చూపించి, ఏంటి ఈ బలుపు?, ఇండస్ట్రీ లో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగా మీరు కూర్చునే విధానం ఇదా?, ఏమి చదువుకున్నావు నువ్వు?, డాక్టర్ కదా?, మీ ప్రొఫెసర్స్ ముందు ఇలాగే కూర్చుంటావా?, ఇది పద్దతా అని అడుగుతాడు. దానికి ప్రియ కాస్త తడబడుతూ ‘అది మేము మామూలుగా కూర్చున్నాం సార్. కావాలని కూర్చోలేదు’ అని అంటుంది. సోషల్ మీడియా లో కూడా గతం లో ఈ యాటిట్యూడ్ పై పెద్ద రచ్చ నే జరిగింది. కామనర్స వెర్సస్ సెలబ్రిటీస్ అంటూ గోల చేసావు, మీరు నెల రోజుల పాటు అగ్నిపరీక్ష లో ఉన్నారు, ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి వెళ్తున్నారు?, మీరిప్పుడు కామనర్ నా ? అని అడుగుతాడు శివాజీ.
ఇలా ఎన్నో ప్రశ్నలకు ఆమె నోటి నుండి సమాధానం రాలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు నోరేసుకొని అందరి మీద పడిపోయేదానివి కదా?, ఇప్పుడేమైంది ఇంత సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు శివాజీ. దానికి కూడా ఆమె నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ నువ్వు, శ్రీజ నామినేషన్స్ లోకి వచ్చి ఉంటే, ఎవరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు? అని శివాజీ అడిగిన ప్రశ్నకు ప్రియ శ్రీజ అని సమాధానం చెప్తుంది. ఎందుకు? అని అడగ్గా, నేను నెగిటివిటీ ని గమనించి నన్ను నేను చాలా వరకు మార్చుకున్నాను, కానీ శ్రీజ మారలేదు, అందుకే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నాను అని అంటుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ 7 లో శోభ శెట్టి లాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని 12 వారాలకు పైగా ఓట్లు వేసి గెలిపిస్తూ వచ్చిన జనాలు, ప్రియ కి కూడా ఒక అవకాశం ఇచ్చి ఉండుంటే బాగుండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.