Hit3 Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit: The Third Case) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రెండవ రోజు, మూడవ రోజు కూడా అదే జోరు ని కొనసాగిస్తూ దూసుకెళ్లింది. నేటి తో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నాని మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా పై సోషల్ మీడియా లో పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న అనిరుద్ కామెంట్స్..’కింగ్డమ్’ బాగా రాలేదా?
వారిలో ముందుగా మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) వేసిన ట్వీట్ గురించి మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ ‘ హిట్ 3 గురించి అద్భుతమైన రివ్యూస్ వింటున్నాను. నా బ్రదర్ నాని కి ప్రత్యేకించి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆయన ఎంచుతున్న కథలు, వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తీరు ఎంతో అద్భుతం. డైరెక్టర్ శైలేష్ కొలను ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకొని అద్భుతంగా తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ చెప్తున్నాను. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి గారికి, నిర్మాత ప్రశాంతి రెడ్డి కి ప్రత్యేకించి శుభాకాంక్షలు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ట్వీట్ కి నాని కాసేపటి క్రితమే రిప్లై ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘చరణ్..థాంక్యూ వెరీ మచ్..నీ పెద్ది సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ తన స్టైల్ లో రిప్లై ఇచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల తో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం, అదే విధంగా రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కేవలం ఒక్క రోజు తేడా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. అయితే పెద్ది తో క్లాష్ ఉంటుంది కాబట్టి, మీరు తప్పుకుంటారా అని నాని ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అడగగా, ‘ఏమో అది ఇప్పుడే చెప్పలేము..మేము అయితే ఈ సినిమాని మార్చ్ 26 న విడుదల చేసేలా ప్రణాళిక ని చేసుకున్నాము. సంక్రాంతి లాగానే, సమ్మర్ కూడా రెండు మూడు పెద్ద సినిమాలు విడుదల చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. రెండు చిత్రాలకు అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. కాబట్టి ఒక్క రోజు గ్యాప్ లో ఒకవేళ వచ్చినా రెండు సినిమాలు సక్సెస్ అవుతాయి’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Hearing fantastic reviews about #HIT3.
Special mention to my dear brother @NameisNani ❤️ for choosing unique scripts and scoring blockbusters across genres.
Hats off to @KolanuSailesh for scripting and executing this intense film.
Congratulations @SrinidhiShetty7,…
— Ram Charan (@AlwaysRamCharan) May 3, 2025
Charan.♥️ Thank youu. Cant wait to see you hit that handle on ground and knock it out of the world with #Peddi . https://t.co/jitXwXgWJv
— Nani (@NameisNani) May 4, 2025