: మన తెలుగు బుల్లితెర పై సెన్సేషన్ సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటి వరుకు ఈ రియాలిటీ షో 5 సీజన్స్ ని పూర్తి చేసుకొని ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టింది..ఈ ఆరవ సీజన్ ప్రారంభం లో కాస్త నత్తనడకనే సాగినప్పటికీ, ప్రస్తుతం ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ముందుకు దూరుకుపోతుంది..ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ రియాలిటీ షో పై గతం లో ప్రముఖ సామజిక కార్యకర్త కె జగదీశ్వర్ రెడ్డి హై కోర్టు లో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

అసభ్యత,హింస ని ప్రోత్సహిస్తూ యువత ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని వెంటనే ఆపివేయాలని కొంతకాలం క్రితం ఆయన హై కోర్టు లో పిటిషన్ వేశారు..బిగ్ బాస్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఒక 3 చూస్తామని..చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హై కోర్ట్ అప్పట్లో ఈ కేసు ని నేటికీ వాయిదా వేసింది.
నేడు విచారణ జరిపిన హై కోర్టు బిగ్ బాస్ నిర్వాహకులకు మరియు అక్కినేని నాగార్జున కి హై కోర్టు నోటీసులు పంపింది..రెండు వారాల్లోపు ఈ నోటీసులకు కౌంటర్ దాఖలు చెయ్యాలని..లేని పక్షం లో కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది..నాగార్జున మరియు బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చిన కౌంటర్ ప్రకారం తదుపరి విచారణ జరిపి అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటామని హై కోర్టు చెప్పుకొచ్చింది..అంటే బిగ్ బాస్ రియాలిటీ షో ఆగిపోతుందా..? అనే టెన్షన్ ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది..ప్రతి ఏడాది సరికొత్త సీజన్ తో మన ముందుకి వచ్చే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారు..అలాంటి షో ఆపేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోదామని వాళ్ళు బాధపడుతున్నారు.

గత సీసన్ ప్రసారం అవుతున్నప్పుడే హై కోర్టు లో కేసు నమోదు చెయ్యడం తో అప్పటి నుండి బిగ్ బాస్ కొన్ని హద్దులు గీసుకొని అది దాటకుండా గేమ్ ని నిర్వహిస్తుంది..ఈ సీజన్ కూడా గత సీజన్స్ లో లాగ కాకుండా లవ్ ట్రాక్స్ మరియు రొమాన్స్ కి తావు ఇవ్వకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ ని ప్రధాన అస్త్రం గా తీసుకొని షో ని నిర్వహిస్తున్నారు..మరి హై కోర్టు తుది తీర్పు ఎలా ఉండబోతుందో తెలియాలంటే రెండు వరాలు వేచి చూడాల్సిందే.