Homeఎంటర్టైన్మెంట్Hey Balvanth First Week Collections Worldwide: 'హే బల్వంత్' మొదటివారం వరల్డ్ వైడ్...

Hey Balvanth First Week Collections Worldwide: ‘హే బల్వంత్’ మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. హిట్ టాక్ తో ఇంత చిల్లర ఊహించలేదు!

Hey Balvanth First Week Collections Worldwide: ఈ ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల్లో ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘హే బల్వంత్'(Hey Balvanth). సుహాస్(Actor Suhas) హీరో గా నటించిన ఈ సినిమా డీసెంట్ స్థాయి అంచనాల నడుమ విడుదలై మంచి టాక్ ని తెచ్చుకున్నప్పటికీ కూడా, ఎందుకో ఓపెనింగ్స్ నుండే ఈ చిత్రం బాగా వెనకబడింది. కనీసం వీకెండ్ లో అయినా పుజుకుంటుందేమో అని ఆశిస్తే , అది కూడా జరగలేదు. చాలా యావరేజ్ బాక్స్ ఆఫీస్ రన్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. 7 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా , వారం రోజులు పూర్తి చేసుకోగా, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 7వ రోజున ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.

Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!

నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి వారం 1 కోటి 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 1 కోటి 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి వారం లో తెలుగు రాష్ట్ర నుండి 2 కోట్ల 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ చిత్రానికి వచ్చిన టాక్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 1 కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.

గ్రాస్ వసూళ్లు 8 కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చు. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా మరో మూడు కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.
ఈ వీకెండ్ లో మహా అయితే మరో కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే ఈ చిత్రానికి వచ్చే అవకాశం ఉంది. అది కూడా అనుమానమే అని అంటున్నారు. సుహాస్ కి మొదటి నుండి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన గత చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాబట్టి ఈ చిత్రానికి మంచి టాక్ రావడం తో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకున్నారు. కట్ చేస్తే క్లోజింగ్ కి కూడా ఆ మార్కును అందుకోవడం కష్టమైపోయింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version