Homeఎంటర్టైన్మెంట్Heroines Love With Top Criminals: స్కామ్ లు చేసే వారినే హీరోయిన్లు ప్రేమిస్తారు.....

Heroines Love With Top Criminals: స్కామ్ లు చేసే వారినే హీరోయిన్లు ప్రేమిస్తారు.. ఇవే ఆధారాలు

Heroines Love With Top Criminals: ఈ మధ్య హీరోయిన్లకు సంబంధించి కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కుంభ‌కోణాల వార్త‌ల్లో నిలుస్తున్న వారితో కొందరు హీరోయిన్ల బాగా సాన్నిహిత్యంగా ఉంటున్నారు. ఇదే ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కంగా మారింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే.. ఈజీ మ‌నీ అని ఓ వాదన ఉంది. ముఖ్యంగా సినిమాల్లో హీరోయిన్లకు చాలా ఈజీగానే మ‌నీ వస్తోంది.

Heroines Love With Top Criminals
Sushmita Sen Lalit Modi

అయితే, అలాంటి మ‌నీకి అలవాటు పడిన హీరోయిన్లు, ఇక సినిమాలు తగ్గాక, ఖాళీగా ఉండలేకపోతున్నారు. ఎలాగూ పెళ్లి పెటాకులు ఉండవు కాబట్టి.. డబ్బు ఎక్కడ ఉంటుందో.. మెయిన్ గా ఈజీమ‌నీ ఎక్కడ ఉంటుందో అక్కడ వాలిపోతున్నారు. అక్రమ సంపాదనతో కేసుల‌ను ఎదుర్కొంటున్న వారితో.. సదరు హీరోయిన్లు ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నారు. ఈ బంధం డబ్బుతో మొదలై.. ఆ డబ్బుతోనే ముగుస్తోంది అనుకోండి.

Also Read: Pawan Kalyan- Akira Nandan: షాకింగ్ : అకీరాతో నాకు సంబంధం లేదని పవన్ నిజంగానే అన్నారా ?

ల‌లిత్ మోడీ ఐపీఎల్ స్కామ్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియాలో అడుగుపెట్ట‌లేక‌పోయాడు. మరి ఈ ల‌లిత్ మోడీని ఎలా పెట్టుకుందో పట్టుకుంది ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ సుస్మితా సేన్. ప్రస్తుతం అతనితో డేటింగ్ చేస్తోంది. గత రెండు రోజుల నుంచి ఇదే వార్త స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపుతోంది. ద‌శాబ్దాల కింద‌ట అంత‌ర్జాతీయ అందాల పోటీల్లో దేశ ప‌తాకాన్ని ఎగ‌రేసిన సుస్మిత, ఇప్పటికీ తన అందాలను కాపాడుకుంటూనే వస్తోంది.

ఆమెలో న‌ట‌నాప‌టిమ సంగతి పక్కన పెడితే.. అందాల విందులో మాత్రం ఆమెను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. తనలో ఎంతో మ్యాటర్ ఉందని ఆమె ఇప్పటికే నిరూపించుకుంది. ఇక సుస్మితకు ఎఫైర్లు కొత్త కాదు. గతంలో అనేక రిలేష‌న్ షిప్ లతో సేద తీరింది. త‌న స‌హ‌న‌టులతో సుస్మితా సేన్ కు చాలా ఘాటు అనుబంధం ఉంది. కొందరితో స‌హ‌జీవ‌నం కూడా చేసింది.

సుస్మిత పెళ్లి చేసుకోకుండా అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త కూడా తీసుకుంది. ప్రస్తుతం ల‌లిత్ మోడీతో సరసాలు ఆడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ల‌లిత్ మోడీకి గ‌తంలో పెళ్లైంది. త‌న క‌న్నా వ‌య‌సులో పెద్ద‌దైన ఒక మ‌హిళ‌ను ల‌లిత్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మ‌ర‌ణించింది. దాంతో ల‌లిత్ మోడీ ఒంటరివాడు అయిపోయాడు. అందుకే, లేటువ‌య‌సులో మ‌రో బంధాన్ని వెతుకున్నాడు.

Heroines Love With Top Criminals
Jacqueline Fernandez Sukesh Chandrasekaran

ఇక సుస్మితా సేన్ లాగే, మరో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా అక్రమ సంపాదన దారుడు ‘సుఖేష్ చంద్ర‌శేఖ‌ర‌న్’ తో ప్రేమలో ముగినితేలింది. ఇతగాడు నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణంలో అడ్డంగా బుక్ అయ్యాడు. దాంతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ప్రస్తుతం ఈడీ చుట్టూ తిరుగుతుంది. అలాగే అప్పట్లో దావూద్ ఇబ్ర‌హీంతో, బాలీవుడ్ స్టార్ మందాకిని కూడా చాలా సాన్నిహిత్యంగా మెలిగింది.

అలాగే మ‌రో డాన్ అబుస‌లేంతో మోనీకా బేడీ కూడా ప్రేమలో పడింది. ఆ తర్వాత మోనీకా బేడీ జైలు పాలైంది అనుకోండి. మొత్తానికి ఆర్థిక నేరస్తులతో హీరోయిన్లు ఘాటు సరసాలకు ప్రధాన ఆర్థిక వనరులే.

Also Read:Tollywood Producers to Stop Shootings: టాలీవుడ్ నిర్మాతలు సంచలన నిర్ణయాలు.. 2 నెలలు షూటింగ్స్ బంద్
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular